»   » చిరంజీవి ఫ్యాన్స్ దాడి చేసి ఇష్యూని పెద్దగా చేసారు: జీవిత

చిరంజీవి ఫ్యాన్స్ దాడి చేసి ఇష్యూని పెద్దగా చేసారు: జీవిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, జీవిత రాజశేఖర్ మధ్య ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. మీడియా ముఖంగా ఇరు వర్గాలు అప్పట్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు.

2009 ఎన్నికల కోసం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి పోటీ చేస్తుంటే.... చిరంజీవికి వ్యతిరేకంగా జీవితరాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసారు. ఓ సినిమా నటుడిగా చిరంజీవిని అభిమానిస్తా. కానీ, ఆయనకు పొలిటికల్‌గా అనుభవం లేదు. అందుకే నేను వేరే పార్టీకి సపోర్ట్‌ చేస్తాను అటూ అప్పట్లో రాజశేఖర్ ప్రకటన చేయడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఓ సెన్సేషన్. చిరు అభిమానులు జీవితరాజశేఖర్ కారుపై దాడి చేయడం, తర్వాత చిరు స్వయంగావెళ్లి జరిగిన పరిణామాలపై వారికి సారీ చెప్పడం తెలిసిందే.

అప్పట్లో ఇరు వర్గాల మధ్య పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే మారింది. అప్పటి సంఘటనలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి గుర్తు చేసుకున్నారు. అసలు అప్పుడు ఏం జరిగింది? అప్పట్లో గొడవ తర్వాత చిరంజీవితో రిలేషన్ ఎలా ఉందనే దానిపై జీవిత స్పందించారు.

జీవిత స్పందిస్తూ....

జీవిత స్పందిస్తూ....

‘2009 ఎన్నికల సమయంలో మీడియా వారు....‘మీరు చిరంజీవి పార్టీకి సపోర్ట్‌ చేస్తారా? అని రాజశఖర్ ను అడిగితే చిరంజీవిని అభిమానిస్తా. కానీ, ఆయనకు పొలిటికల్‌గా అనుభవం లేదు. అందుకే నేను వేరే పార్టీకి సపోర్ట్‌ చేస్తాన'ని రాజశేఖర్‌ చెప్పారు. కానీ దీనిపై చిరంజీవి అభిమానులు ఓవర్ గా రియాక్ట్ అయ్యారు అని జీవిత తెలిపారు.

ఇష్యూ పెద్దది చేసి దాడి చేసారు

ఇష్యూ పెద్దది చేసి దాడి చేసారు

రాజకీయాలపై ఎవరి అభిప్రాయం వారిది. దాన్ని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. కానీ, చిరంజీవి ఫ్యాన్స్‌ మామీద దాడి చేసి ఆ ఇష్యూని పెద్దది చేశారు. అందుకే మేం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవికి వ్యతిరేకంగా పనిచేశామని జీవిత తెలిపారు.

ఇపుడు చిరంజీవి గారితో రిలేషన్ ఓకే

ఇపుడు చిరంజీవి గారితో రిలేషన్ ఓకే

ఎన్నికలు అయిపోయాక చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయింది. అపుడే రాజకీయాలంటే ఏంటో నాకు అర్థమైంది. అందుకే కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చాం. ప్రస్తుతం చిరంజీవిగారితో రిలేషన్‌ బాగానే ఉంది. ఇప్పు‌డు మేము బీజేపీలో ఉన్నామని జీవిత తెలిపారు.

అవన్నీ పుకార్లే.... కుమార్తె తెరంగేట్రం పై స్పందించిన జీవితారాజశేఖర్

అవన్నీ పుకార్లే.... కుమార్తె తెరంగేట్రం పై స్పందించిన జీవితారాజశేఖర్

సినీ ప్రపంచం లో ఏ విషయమైనా వెంటవెంటనే వ్యాపించి పోతుంది. సామాన్య జనానికి సినిమా వాళ్ళ మీద ఉండే ఆసక్తివల్ల కూడా ప్రతీ వార్తా అసలు విషయానికి మరికొంత రంగు పులుముకుంటూ పోతాయి. రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తె శివాని సినిమాల్లోకి రానున్నట్టుగా, కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Jeevitha Rajasekhar shares her personnel and political experiences and Many more things in “Heart to Heart With Swapna” program.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu