»   » ఛార్మి ‘జ్యోతి లక్ష్మి’కి మహిళా సంఘాల మద్దతు (ఫోటోస్)

ఛార్మి ‘జ్యోతి లక్ష్మి’కి మహిళా సంఘాల మద్దతు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఛార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ తెరకెక్కిన చిత్రం ‘జ్యోతి లక్ష్మి'. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన ‘మిసెస్ పరాంకుశం' నవల ఆధారంగా చేసుకుని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్ 12న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మహిళలు తప్పకుండా చూడాల్సిన సినిమా అని ప్రచార కార్యక్రమాల్లో ఊదరగొడుతున్న పూరి జగన్నాథ్ తాజాగా మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా షో వేసారు. బుధవారం ప్రసాద్ ల్యాబ్స్ లోని ప్రివ్యూ థియేటర్లో ఈ షో ప్రదర్శించారు. మహిళా సంఘాలకు చెందిన ప్రముఖులు ఈ స్పెషల్ షో చూడటానికి హాజరయ్యారు. వీరిలో లాయర్స్, డాక్టర్స్, టీచర్స్ తో పాటు పలువురు విద్యావంతులు కూడా ఉండటం గమనార్హం. వీరితో పాటు చంపాపేట నుండి వచ్చిన హ్యాండికేప్డ్ విద్యార్థినిలు ‘జ్యోతిలక్ష్మి' చిత్రాన్ని వీక్షించి చిత్ర యూనిట్‌ని అభినందించారు.


మహిళా సంఘాల ముఖ్యనేతలు మాట్లాడుతూ....పూరి జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మి' చిత్రాన్ని కమర్షియల్‌గా తీస్తూ అంతర్లీనంగా మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క మహిళా చూడాల్సిన చిత్రం ఇది. స్త్రీలంతా గర్వపడే విధంగా పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...


పూరి మాట్లాడుతూ..

పూరి మాట్లాడుతూ..

పలువురు మహిళలు మంచి చిత్రం, బాగా తీసానని ప్రశంసిస్తుంటే మాటలు రావడం లేదు. ఈ సినిమా తీసిందే మహిళల కోసం. మహిళ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా చూడాల్సిన సినిమా అన్నారు.


చార్మి మాట్లాడుతూ..

చార్మి మాట్లాడుతూ..

ఈ సినిమా చేసినందుకు చాలా ప్రౌండ్ గా ఫీలవుతున్నాను, బాగా తీసావ్ అంటుంటే ఎమోషన్ అయి కన్నీళ్లు వస్తున్నాయి అన్నారు.


సి కళ్యాణ్

సి కళ్యాణ్

ఈ సినిమా పబ్లిసిటీ డిఫరెంటుగా ప్లాన్ చేసాం. పోస్టర్లు చూసి వల్గర్ సినిమా అనుకున్నారు. కానీ సినిమా చూసాక అందరికీ అర్థమైంది. అభినందిస్తున్నారు. ఫ్యామిలీ లేడీస్ ఆదరణ పెరిగింది అన్నారు.


హీరో సత్య మాట్లాడుతూ..

హీరో సత్య మాట్లాడుతూ..

ఫస్ట్ టైం సక్సెస్ ఎలా ఉంటుందో చూస్తున్నాను. ప్రతి స్త్రీ ఈ సినిమా గురించి గొప్పగా చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు.


నటుడు శాండీ మాట్లాడుతూ..

నటుడు శాండీ మాట్లాడుతూ..

ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన పూరికి థాంక్స్. ఇలాంటి సినిమాలో నేనూ భాగం అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
English summary
Jyothi Lakshmi is an Telugu film written and directed by Puri Jagannadh starring and presenting by Charmy Kaur in the titular role. It is produced by Swethalana, Varun, Teja, C. V. Raoa and C. Kalyan under the banners Sri Subha Swetha films and C. K. Entertainments.
Please Wait while comments are loading...