»   » రోగ్ చూశాను.. పూరి డైరెక్షన్ నేర్చుకో.. కేఏ పాల్ సెటైర్.. రాజమౌళి, వర్మ, బండ్ల గణేష్‌నూ వదల్లేదు..

రోగ్ చూశాను.. పూరి డైరెక్షన్ నేర్చుకో.. కేఏ పాల్ సెటైర్.. రాజమౌళి, వర్మ, బండ్ల గణేష్‌నూ వదల్లేదు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పుడూ రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే మతగురువు కేఏ పాల్ తాజాగా సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులపై విమర్శనాస్త్రాలను సంధించాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులైన రాజమౌళి, పూరి జగన్నాధ్, రాంగోపాల్ వర్మలపై తనదైన శైలిలో స్పందించారు.

పూరి డైరెక్షన్ నేర్చుకో..

పూరి జగన్నాథ్ ఇప్పుడే నీవు తీసిన రోగ్ చిత్రాన్ని చూశాను. ఈ సినిమాలో కథ ఉంటే మంచి చిత్ర అయ్యేది. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరేందుకు సీటు బుక్ చేసుకో. లగేజి ప్యాక్ చేసుకొని అమెరికాకు రా. నీకు నేను వీసా పంపిస్తాను. నీవు సినిమా తీసేందుకు కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాల్సి ఉంది. ఏమంటావు?

బండ్ల గణేష్

నీవు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫొటో తీసుకోవచ్చు. కానీ నాతో ఫోటో తీసుకోవడానికి ట్రంప్ నా అపాయింట్ మెంట్ తీసుకొంటాడు అని నిర్మాత బండ్ల గణేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.

రాజమౌళి నీవు లక్షలు ఖర్చు చేస్తే..

రాజమౌళి నీవు లక్షలు ఖర్చు చేస్తే..

రాజమౌళి.. నీవు లక్షలు ఖర్చు చేసి బాహుబలి2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం మంత్రుల ప్రమాణస్వీకారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని పాల్ ట్వీట్ చేశారు.

పవనిజంతో పోల్చకండి..

దయచేసి నా పాలిజం‌ను పవనిజంతో పోల్చి చూడకండి. పవనిజం రాష్ట్రస్థాయిది. పాలిజం ప్రపంచస్థాయిది. కేవలం ప్రపంచానికే పరిమితం కాదు. నా ఇజం విశ్వం మొత్తానికి సంబంధించింది అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాది ఐన్‌స్టీన్ స్థాయి

నాది ఐన్‌స్టీన్ స్థాయి

అత్యంత మేధస్సు ఉన్న వ్యక్తుల జాబితాలో భారత్‌లో కొందరే ఉంటారు. అందులో రాంగోపాల్ వర్మది మూడో స్థానం. నేను వారి జాబితా నేను చేరను. నాది ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ స్థాయి అంటూ తనను తాను పొగుడుకుంటూ మరో ట్వీట్ చేశారు.

మోదీ, ట్రంప్ గెలుపుకు కారణం నేనే..

మోదీ, ట్రంప్ గెలుపుకు కారణం నేనే..

2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలిచినా.. హిల్లరీపై ట్రంప్ చారిత్రక గెలుపును సాధించినా అందుకు కారణం తానే అని కేఏ పాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇండియన్ ఐడల్‌లో విజయ పతాకం ఎగురవేసిన రేవంత‌ను కూడా వదిలిపెట్టకుండా కామెంట్లు చేయడం గమనార్హం.

English summary
Religious guru K A Pual satirical comments on Tollywood directors Puri Jagannadh, Ram Gopal Varma, SS Rajamouli. He said that he recently watched Rogue movie. The move is good if story is there in it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu