»   » మోక్షఙ్ఞ తరువాత మరో నటవారసుడు ఎవరు...?

మోక్షఙ్ఞ తరువాత మరో నటవారసుడు ఎవరు...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటేనే వారసుల రాజ్యం అనొచ్చు. ఒకరి వెనుక ఒకరుగా వెండితెరమీదికి వచ్చిమ్న వారసులకు లెక్క లేదు. ఈ మధ్య ఆ హవా మరీ ఎక్కువైంది కూడా. మొదట వారసుడు ట్యాగ్ తో వచ్చినా, తమకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోలేని వాళ్ళు పక్కకి తప్పుకుంటూనే ఉన్నారు. అదే దారిలో ఇప్పుడు ఇంకో నటవారసుడూ బాలనటుడిగా తెరంగేట్రం చేయనున్నాడు.

నందమూరి కళ్యాణ్ రామ్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కళ్యాణ్ రామ్ తనయుడు '"శౌర్య రాం " వెండితెర కు బాల నటుడిగా పరిచయం కానున్నాడు . కళ్యాణ్ రామ్ కూడా అప్పట్లో బాబాయ్ బాలకృష్ణ తో ''బాల గోపాలుడు '' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే .

Kalyan Ram Son Shourya Debut in Puri film

కాగా వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఆ చిత్రంలో ఓ చిన్న పాత్రలో శౌర్య రామ్ నటించనున్నట్లు తెలుస్తోంది . శౌర్య ని చూసిన పూరి జగన్నాద్ అతడి చేత నటింప జేయడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది . కళ్యాణ్ రామ్ నిర్మిస్తూ నటిస్తున్న ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు.

దర్శకుల కుమారులూ, మాజీ, ఇప్పటి హీరోల వారసులూ తెరమీదికి వస్తూనే ఉన్నారు. నిలబడ్డవాళ్ళు నిలబడగా తెరమరుగౌతూన్నవాళ్ళూ ఉన్నారు. నందమూరి కుటుంబం నుంచే వస్తున్న ఈ బాల హీరో తెలుగు తెరకి ఏం తీసుకురానున్నాడో కాలమే చెప్పాలి.

English summary
Puri Jagannadh is planning to cast Kalyan Ram's son in his new Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu