»   »  నా ఆస్తి మొత్తం ఆ హీరోయిన్‌‌కే : కరణ్ జోహార్ ప్రకటన

నా ఆస్తి మొత్తం ఆ హీరోయిన్‌‌కే : కరణ్ జోహార్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ చేసిన ప్రకటన బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ కింగ్ మేకర్లలో ఒకరైన ఆయన నిర్మాతగా వందల కోట్ల ఆస్తికి అధిపతి. పైగా పెళ్లి పెటాకులు లేని బ్రహ్మచారి. ఆయనకు వారసులు కూడా లేరు. తాజాగా ఆయన తన ఆస్తికి వారసురాలు హీరోయిన్ అలియా భట్ అంటూ ప్రకటించాడు.

ఎట్టకేలకు...తన జెండర్ గురించి మాట్లాడిన కరణ్ జోహార్!
కరణ్ జోహార్ నోట ఆ మాట రావడంతో అంతా ఆశ్చర్య పోయారు. మొదటి నుంచి తనకు అలియా అంటే చాలా ఇష్టమని, ఏదో ఒక రోజు తన వద్ద ఉన్న ఆస్తి మొత్తానికి ఆమె వారసురాలవుతుందని కరణ్ స్వయంగా తెలిపారు. మరి కరణ్ జోహార్ ఈ మాట సీరియస్ గా అన్నారా? లేక సరదాగా అన్నారా? అనేది తేలడం లేదు.

Karan Johar announces his heir

అయితే కరణ్ జోహార్ మాటలను అంత తేలికగా తీసుకోవడానికి వీల్లేదన అంటున్నారు. మహేష్ భట్ కూతురైన అలియా భట్ తో కరణ్ జోహార్‌కి మంచి అనుబంధం ఉంది. ఆమెను తన కూతురులా చూసుకుంటారు. అలియాను హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం చేసింది కూడా ఆయనే.

ప్రస్తుతం కరణ్ నిర్మిస్తున్న 'కపూర్ అండ్ సన్స్'లో కూడా అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ముంబయిలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగానే కరణ్ జోహార్ మాట్లాడుతూ అలియా తన ఆస్తికి వారసురాలు అవుతుంది అంటూ ప్రకటించారు.

English summary
Karan has stunned everyone by announcing his heir. At a recent media interaction, the ‘My Name Is Khan’ director announced that whatever money he is left with will pass to Alia Bhatt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu