»   » ‘బాహుబలి-2’..... కరణ్ జోహార్ దెబ్బ కొడితే కోలుకోవడం కష్టమే!

‘బాహుబలి-2’..... కరణ్ జోహార్ దెబ్బ కొడితే కోలుకోవడం కష్టమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-ది బిగినింగ్' సినిమా ఎవరూ ఊహించని భారీ విజయం సాధించింది. ఈ సినిమా మొత్తం రూ. 650 కోట్లు వసూలు చేస్తే... అందులో ఎక్కువ మొత్తం హిందీ వెర్షన్ నుండే వచ్చాయి. సౌత్ సినిమాలు హిందీలో పెద్దగా ఆడవు. కానీ బాహుబలి హిందీ వెర్షన్ అంత పెద్ద విజయం సాధించింది అంటే ప్రధాన కారణం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ అని చెప్పక తప్పదు.

సినిమాలను ప్రమోట్ చేయడంలో కరణ్ జోహార్‌ రూటే సపరేటు. అందుకే బాలీవుడ్లో బాహుబలి సినిమాకు బాలీవుడ్ అంత హైప్ వచ్చింది, అన్ని కోట్లు వసూలు చేసింది. రాజమౌళి కూడా ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు.


'బాహుబలి-2' హిందీ రిలీజ్ బాధ్యత కూడా కరణ్ జోహార్‌కే అప్పగించాలని నిర్మాతలు ముందు నుండీ భావిస్తున్నారు. అయితే తీరా విడుదల సమయం దగ్గర పడుతున్న కరణ్ జోహార్-బాహుబలి నిర్మాతల మధ్య వ్యవహారం ఏదో తేడా వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఏం జరిగింది?

ఏం జరిగింది?

బాహుబలి-2 హిందీ వెర్షన్ రైట్స్ కు నిర్మాతలు భారీ రేటు చెబుతుండటంతో అంత పెద్ద మొత్తం పెట్టి రిస్క్ చేసేందుకు కరణ్ జోహర్ సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ విషయంలో బాహుబలి-2 నిర్మాతలకు, కరణ్ జోహార్ కు మధ్య చర్చలు నడుస్తున్నాయట.


ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీలో

ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీలో

బాహుబలి పార్ట్ 1 భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ రైట్స్ దక్కించుకునేందుకు పలు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వారు ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తుండటం, కరణ్ జోహార్ అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా లేక పోవడంతో ఎటూ తేల్చుకోలేక పోతున్నారట నిర్మాతలు.


అతడు లేకుండా?

అతడు లేకుండా?

అయితే కరణ్ జోహార్ లేకుండా బాహుబలి-2 భారీ విజయం సాధించడం సాధ్యమేనా? వేరే వారి చేతికి సినిమా రైట్స్ ఇస్తే ఆశించిన ఫలితాలు రాక పోవచ్చు అనే మీమాంసలో పడ్డారు నిర్మాతలు.


దెబ్బ కొడతాడా?

దెబ్బ కొడతాడా?

ఈ పరిణామాల నేపథ్యంలో కరణ్ జోహార్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం రోబో 2.0పై ..... ఆసక్తి చూపిస్తుండటం బాహుబలి-2 నిర్మాతలను ఆందోళనలో పడేసింది. 2.0 చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం కరణ్ జోహార్ చేతుల మీదుగానే జరుగబోతోంది.


రోబో 2.0 కొనబోతున్న కరణ్ జోహార్ వాటా

రోబో 2.0 కొనబోతున్న కరణ్ జోహార్ వాటా

రోబో 2.0 హిందీ హక్కులను కరణ్ కొనుగోలు చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బాహుబలి 2 నుండి కరణ్ జోహార్ తప్పుకునే అవకాశాలున్నాయని...... ఈ ప్రభావం బాహుబలి-2 మీద తప్పకుండా పడుతుందని అంటున్నారు.


బ్లాక్‌మనీ అనుమానాలు? బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు!

బ్లాక్‌మనీ అనుమానాలు? బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు!

దేశ వ్యాప్తంగా రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో.... కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ లాంటి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


రాజమౌళి కూతురికి ఆ హీరో ఇచ్చిన సలహా ఏమిటో? ఏం జరిగింది?

రాజమౌళి కూతురికి ఆ హీరో ఇచ్చిన సలహా ఏమిటో? ఏం జరిగింది?

రాజమౌళి కూతురికి ఆ హీరో ఇచ్చిన సలహా ఏమిటో? ఏం జరిగింది?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి

నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి

నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


ప్రభాస్ పెళ్లి ఖరారు: బాహుబలి-2 రిలీజ్ ముందే, ఎక్కడమ్మాయి అంటే?

ప్రభాస్ పెళ్లి ఖరారు: బాహుబలి-2 రిలీజ్ ముందే, ఎక్కడమ్మాయి అంటే?

ప్రభాస్ పెళ్లి ఖరారు: బాహుబలి-2 రిలీజ్ ముందే, ఎక్కడమ్మాయి అంటే?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


బాహుబలి-2 : దిల్ రాజును ఎందుకు తప్పించారు? కావాలనే చేసారా?

బాహుబలి-2 : దిల్ రాజును ఎందుకు తప్పించారు? కావాలనే చేసారా?

బాహుబలి-2 : దిల్ రాజును ఎందుకు తప్పించారు? కావాలనే చేసారా?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


English summary
Film Nagar source said that, Bollywood producer Karan Johar is not showing interest on Baahubali 2 release now. Karan Johar eye on Rajinikanth Robo 2.0.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu