»   »  మెగా డాటర్ నిహారిక అభిమానులకు శుభవార్త!

మెగా డాటర్ నిహారిక అభిమానులకు శుభవార్త!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్ తో చాలా మంది అభిమానులను ఏర్పరుచుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కేవలం 5 ఎపిసోడ్లకే శుభం కార్డు వేయడంతో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అలా డిసప్పాయింటులో ఉన్న ఫ్యాన్స్ కి ఓ శుభవార్త. ఆమె త్వరలో హీరోయిన్ పరిచయంకబోతోంది. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఒక మనసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

నాగ బాబు కూతురు నిహారికపై హరాస్మెంట్ కేసు వేస్తాం!
ఈ సినిమా గురించి నాగ శౌర్య మాట్లాడుతూ...‘షూటింగ్ పూర్తయింది. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి' అన్నారు. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వచ్చింది. మరో వైపు నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ తో యాక్టింగ్ టాలెంట్ పరంగా తానేంటో నిరూపించుకుంది. వెబ్ సిరీస్ లో అదరగొట్టిన నిహారిక సినిమాలో మరింత ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

 Konidala Niharika's 'Oka Manasu' shooting completed

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగశౌర్య తండ్రి పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. అందువలన ఆ పాత్రకి ప్రకాశ్ రాజ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి ఆయనని తీసుకున్నారని అంటున్నారు.

నిహారిక టెర్మ్స్ అండ్ కండీషన్స్.... (రొమాంటిక్ వీడియో)
ఈ సినిమాలో నిహారిక తల్లి పాత్ర ప్రముఖ నటి రమ్య కృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో నిహారిక తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే రమ్య కృష్ణ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన రానుంది.

హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరిగింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

English summary
'Oka Manasu' starring Naga Shourya and Konidala Niharika has almost wrapped up the shooting. "The shoot was completed, except for one or two days of work. Post-Production Work is in full swing" Naga Shourya said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu