twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger pre release review: ప్యాన్ ఇండియా స్థాయిలో ధమాకా.. విజయ్ దేవరకొండ, పూరీ మ్యాజిక్

    |

    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్గు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు, ప్రమోషన్ కార్యక్రమాలు దుమ్ము దులిపేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన విశేషాల్లోకి వెళితే..

    ప్రత్యేక ఆకర్షణగా మైక్ టైసన్

    ప్రత్యేక ఆకర్షణగా మైక్ టైసన్

    లైగర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ మైక్ టైసన్. ఈ సినిమా కథను విజయ్ దేవరకొండకు పూరీ జగన్నాథ్ చెప్పినప్పుడు మైక్ టైసన్ రెఫరెన్స్‌తో చెప్పాడు. కానీ మైక్ టైసన్ చేత ఆ పాత్రను పోషింప చేయాలని అనుకోలేదు. ఆ తర్వాత మైక్ టైసన్ ఉంటే బాగుంటుందని నెలరోజులపాటు ట్రై చేస్తే అపాయింట్‌మెంట్ దొరికింది. అయితే చాలా కష్టపడి ఈ సినిమాలో నటింపజేసే విధంగా పూరీ టీమ్ ఒప్పించింది.

    కరీంనగర్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి

    కరీంనగర్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి


    లైగర్ సినిమా కథ విషయానికి వస్తే.. కరీంనగర్ పట్టణం నుంచి ముంబైకి వలస వెళ్లిన ఓ తల్లి, కొడుకు చాయ్ అమ్ముకొని బతుకుతుంటారు. కానీ తన కొడుకును బాక్సర్ చేయాలనే బలమైన కోరికతో రమ్యకృష్ణ ఉంటుంది. అయితే తన కొడుకును ఇంటర్నేషనల్ స్థాయికి ఎలా తీసుకెళ్లిందనేది ఈ సినిమా కథ అని పూరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    ప్రపంచవ్యాప్తంగా 3000 పైగా థియేటర్లలో

    ప్రపంచవ్యాప్తంగా 3000 పైగా థియేటర్లలో


    లైగర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3000లకుపైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. నైజాంలో 350 కిపైగా థియేటర్లు, సీడెడ్‌లో 190 థియేటర్లు, ఆంధ్రా 450 థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఏపీ, నైజాంలో కలిపి సుమారు 1000 థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. కర్ణాటకలో 100కుపైగా, తమిళనాడులో 100కుపైగా, కేరళలో 100, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 1000 కిపైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఇక ఓవర్సీస్‌లో 700 థియేటరల్లో రిలీజ్‌కు సిద్దమైంది.

    వన్ మ్యాన్ షో అంటూ

    వన్ మ్యాన్ షో అంటూ


    లైగర్ సినిమా గురించి ఉమేర్ సంధూ ట్వీట్ చేస్తూ.. ఈ సినిమా సీటీమార్ మాస్ ఎంటర్‌టైనర్. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో. ఈ సినిమాను ఒక్కడే భుజాల మీద మోశాడు. టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్, డైరెక్షన్. రమ్యకృష్ణ సర్‌ప్రైజ్ ప్యాకేజ్. స్టోరీ, స్క్రీన్ ప్లే యావరేజ్ అని అన్నాడు.

    హాట్ కేకుల్లా టికెట్ల అమ్మకాలు

    హాట్ కేకుల్లా టికెట్ల అమ్మకాలు

    లైగర్ చిత్రం హైదరాబాద్‌లో ఉదయం 7 గంటల స్పెషల్ షోతో ప్రారంభమవుతున్నాయి. స్పెషల్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే నైజాంలో అన్నీ షోలు హౌస్‌ఫుల్ కలెక్షన్లను నమోదు చేసుకొన్నాయి.

    125 కోట్ల బడ్జెట్‌తో

    125 కోట్ల బడ్జెట్‌తో


    లైగర్ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్, చార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహర్ నిర్మించారు. ఈ సినిమా బడ్డెట్ సుమారు 125 కోట్ల రూపాయలు. ఈ సినిమాతో పూరీ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ మ్యాజిక్ చేయడానికి సిద్దమవుతున్నది అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

    English summary
    Vijay Deverakonda's movie released on August 25th. Here are movie highlights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X