»   » మెహబూబా ప్రీమియర్ షో టాక్: పూరి మనసు పెడితే అద్భుతమే.. 1971, 2018 కనెక్ట్ చేస్తూ.. దిల్ రాజు!

మెహబూబా ప్రీమియర్ షో టాక్: పూరి మనసు పెడితే అద్భుతమే.. 1971, 2018 కనెక్ట్ చేస్తూ.. దిల్ రాజు!

Subscribe to Filmibeat Telugu
Mehabooba Movie Premiere Show Public Talk

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కించిన చిత్రం మెహబూబా. పూరి జగన్నాథ్ మెహబూబా చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. మెహబూబా చిత్రం మే 11 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి పూరి అండ్ టీం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్ లో కాలేజీ విద్యార్థులకు, సెలెబ్రెటీలకు చిత్ర యూనిట్ ప్రత్యకమైన ప్రీమియర్ షో ప్రదర్శించారు. కాలేజీ విద్యార్థుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. పూరీని ప్రశంసలతో ముంచెత్తారు. కోన వెంకట్, దిల్ రాజు వంటి ప్రముఖులుప్రీమియర్ షో చూడడం విశేషం. అందరి నుంచి వస్తున్న సూపర్ రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది.

స్టూడెంట్స్ రెస్పాన్స్

స్టూడెంట్స్ రెస్పాన్స్

ప్రీమియర్ షో చూసిన అనంతరం విద్యార్థుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పూరి జగన్నాథ్ చాలా కాలం తరువాత మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రం తీసారని అన్నారు. ఇది పూరిజగన్నాథ్ అసలు సిసలైన చిత్రం అంటూ ప్రశంసించారు.

అనుభూతికి లోనయ్యా

అనుభూతికి లోనయ్యా

ఇప్పుడే సినిమా చూసా.. కాదు కాదు.. అనుభూతికి లోనయ్యా అంటూ ట్వీట్ చేసారు రచయిత కోన వెంకట్. పూరి ప్రేమతో తీసిన ఓ గొప్ప ప్రేమ కథ ఇది అని కోన వెంకట్ అన్నారు. ఆకాష్ చాలా బాగా చేశాడంటూ ప్రశంసించారు.

పూరి మనసు పెడితే అద్భుతమే

పూరి మనసు పెడితే అద్భుతమే


నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని చూసాక ప్రశంసించడం విశేషం. పూరి జగన్నాథ్ మనసు పెడితే అద్భుతమే జరుగుతుందని దిల్ రాజు అన్నారు. మెహబూబా చిత్రం తో అదే జరగబోతోందని అన్నారు. ఈ చిత్రం నిజాయతీతో కూడుకున్న ప్రేమ కథ అని అన్నారు. 1971, 2018 కనెక్ట్ చేస్తూ ప్రేమ కథ చూపించిన విధానం చాలా బావుందని దిల్ రాజు అన్నారు.

ఊహించని చోట్ల కూడా

ఊహించని చోట్ల కూడా

చాలా సన్నివేశాలకు ప్రేక్షకులు థ్రిల్ అవుతారని ముందే ఊహించాం. కానీ వారితో కలసి సినిమా చూస్తున్నపుడు తాము ఊహించని చోట్ల కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని పూరి అన్నారు.

దిల్ రాజు ఐడియానే

దిల్ రాజు ఐడియానే

చిత్ర విడుదలకు రెండు రోజుల ముందే కాలేజీ విద్యార్థులకు ప్రీమియర్ షో ప్రదర్శించాలనే ఆలోచన దిల్ రాజు గారిదే అని ఆకాష్ పూరి తెలిపాడు. ఇది అద్భుతమైన ఐడియా అని, స్టూడెంట్స్ రెస్పాన్స్ చూసిన తరువాత అంతే కాన్ఫిడెన్స్ తో యూఎస్ ప్రమోషన్స్ కు వెలుస్తున్నాం అని ఆకాష్ పూరి తెలిపాడు.

English summary
Mehabooba Movie Premiere Show talk. Dil Raju response after watching movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X