»   » జై బాలయ్య : పూరి కొడుకు ‘మెహబూబా’ ఇలా మొదలైంది (ఫోటోస్)

జై బాలయ్య : పూరి కొడుకు ‘మెహబూబా’ ఇలా మొదలైంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన కొడుకు ఆకాష్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ 'మెహబూబా' అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ బుధవారం ఉదయం 8.20 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభించారు.

ఈ సినిమా కంటే ముందు బాలయ్యతో 'పైసా వసూల్' మూవీ చేసిన పూరి..... తన కొడుకు సినిమా షూటింగ్ ప్రారంభం విషయంలో బాలయ్య సలహా తీసుకున్నారు. బాలయ్య సూచించిన ముహూర్తం మేరకే సినిమాను ఈ రోజు ఉదయం 8.20 గంటలకు మొదలు పెట్టారు.

జై బాలయ్య

జై బాలయ్య

‘మెహబూబా' సినిమా యూనిట్ మొత్తం సినిమా మొదలు పెట్టే ముందు మనసులో ఒకసారి జై బాలయ్య అని తలుచుకుని ఈ సినిమాను ప్రారంభించారట. బాలయ్య సూచించిన ముహుర్తం ఈ సినిమాను విజయం దిశగా నడిపిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

Actress Hema Romance With Puri Jagannadh @Shamanthakamani Pre Release Event | Filmibeat Telugu
మెహబూబా

మెహబూబా

1971లో జరిగిన ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాపుతో ఈ సినిమా కథ సాగుతుంది. అందుకే ఈ సినిమాను హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఇపుడు అక్కడ బాగా మంచు కురిసే కాలం ఆరంభం అవ్వడంతో షూటింగ్ ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ తో పాటు పంజాబ్, రాజస్థాన్‌లలో ఈ సినిమా షూటింగ్ జరుగనుంది.

హైలీ ఇంటెన్స్ లవ్ స్టోరీ

హైలీ ఇంటెన్స్ లవ్ స్టోరీ

ఈ సినిమా స్క్రిప్టు పూర్తి చేసిన అనంతరం పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... తొలిసారిగా తాను హైలీ ఇంటెన్స్ అండ్ పాషనేట్ లవ్ స్టోరీతో సినిమా చేస్తున్నట్లు తాను రియలైజ్ అయ్యానని, తాను ఇప్పటి వరకు చేసిన లవ్ స్టోరీలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపారు.

నేహా శెట్టి

నేహా శెట్టి

ఆకాష్ సరసన హీరోయిన్‌ కోసం పూరి దాదాపు 200 మంది కొత్త అమ్మాయిలను ఆడిషన్ చేశారు. 200 మంది అమ్మాయిలకి ఆడిషన్స్ నిర్వహించిన తరువాత, ఫైనల్‌గా నేహా శెట్టి అనే అమ్మాయిని ఎంపిక చేశారు. నేహా శెట్టి కర్నాటకకు చెందిన అమ్మాయి. కన్నడలో ఇప్పటికే 'ముంగారు మలే 2' అనే సినిమాలో నటించింది. ఇపుడు ఆకాష్ పూరి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.

పూరి స్టైల్ మేకింగ్

పూరి స్టైల్ మేకింగ్

పూరి స్టైల్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సారి తన కొడుకు సినిమా కావడం, అతడి భవిష్యత్తును నిర్ణయించే సినిమా కావడంతో పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ సినిమా ద్వారా కమర్షియల్ హీరోగా

ఈ సినిమా ద్వారా కమర్షియల్ హీరోగా

బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆకాష్ 2015లో హీరోగా చేసిన ‘ఆంధ్రపోరి' సినమా అంతగా సక్సెస్ కాకపోవడంతో కొంత విరామం తీసుకున్నాడు. అయితే ఈ గ్యాప్ లో ఆకాష్ నటనతో పాటు డాన్స్, యాక్షన్, హార్స్ రైడింగ్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా ద్వారా ఆకాష్ పూరి కమర్షియల్ సినిమా ఫార్మాట్లోకి అడుగు పెడుతున్నాడు.

ఎక్స్ పెక్టేషన్స్

ఎక్స్ పెక్టేషన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌కు సినిమా అంటే సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ఆయన కొడుకుతో, తానే దర్శకుడు, నిర్మాతగా సినిమా చేస్తున్నడంటే.... ఈ సినిమాను ఎంత జాగ్రత్తగా తీస్తాడో అర్థం చేసుకోవచ్చు.

    English summary
    "Happy to share that we kick-start our shoot in Himachal Pradesh, Muhurutam shot was taken at 8:20 Am today. Balakrishna garu called and followed up with us repeatedly since morning and blessed our Movie. Thank you so much sir." Team Mehbooba tweeted.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X