Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మా ఇద్దరిమధ్యా సంబంధమా??? ఇంత సిల్లీగా ఆలొచిస్తారా??: చిరాకు పడ్డ నమిత
హాట్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఐటెం గర్ల్, వ్యాంప్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన నమిత కి టాలీవుడ్ .
Recommended Video
హాట్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఐటెం గర్ల్, వ్యాంప్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన నమిత కి టాలీవుడ్ అంతగా కలిసి రాలేదు గానీ కోలీవుడ్ మాత్రం ఈ భారీ అందాల సుందరికి కోలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. ఇప్పుడు ఓ 60 ఏళ్ల నటుడితో ప్రేమాయణం సాగిస్తొందని కోలీవుడ్ లో పుకార్లు.. అప్పట్లో హీరోయిన్ కన్నా ఎక్కువ క్రేజు సంపాదించుకున్న నమిత ఇప్పుడు సినిమాల్లేక కష్టాల్లో ఉంది.
శరత్ బాబు అంటూ వార్తలు
జనం తనని మరిచిపోకుండా ఉండేందుకు తమిళ్ బిగ్ బాస్ షో లో పాల్గొని అదృష్టాన్ని పరిక్షించుకుంది నమిత, పాపం అందులోనూ రాణించలేకపోయింది. ఇప్పుడు నమిత ఓ 60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందనే గుసగుసలు వినిపించాయి. ఆ నటుడు కూడా ఒకప్పుడు హీరోగా, విలన్ గా ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న శరత్ బాబు అంటూ వార్తలు రావటం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
మూడో రిలేషన్ కోసం వెయింటింగ్
ఇప్పుడు మూడో పెళ్ళికి సిద్ధమని కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడట. అలా చెప్పడమే కాక నేను మూడో రిలేషన్ కోసం వెయింటింగ్ చేస్తున్నానని.. అది కూడా ఒక హాట్ హీరోయిన్ అని చెప్పేసరికి అందరూ శరత్ కుమార్ రిలేషన్ లో ఉన్నది నమితతోనే అంటూ ప్రచారం మొదలైంది.
ఇలా ఎలా ఆలోచిస్తున్నారు
ఈ పుకార్లపై స్పందించిన నమిత వీటిని సర్కులేట్ చేసిన వారిపై మండిపడింది. ఆయన వయసెక్కడ? నా వయసెక్కడా? ఇలా ఎలా ఆలోచిస్తున్నారు మీరంతా?? అసలు ఇంత సిల్లీగా పుకార్లు ఎలా పుట్టిస్తారంటూ నమిత గట్టిగానే చీవాట్లు పెట్టింది. అటు శరత్ బాబు కూడా నాకు సంబంధం లేకున్నా అనవసర విషయాల్లోకి నన్ను లాగి వార్తలు సృష్టించి తన క్యారెక్టర్ ని దెబ్బ తీస్తున్నారు అంటూ శరత్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్ళీ పెళ్లి ఉద్దేశ్యం లేదు
అరవయ్యేళ్ళు దాటిన తనకు అసలు మళ్ళీ పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అందరికంటే ముందుగా మీడియాకు చెబుతాను అని తెలిపారు. ఈమధ్య సినిమాలు తగ్గినా రీసెంట్గా జరిగిన బిగ్‌బాస్ తమిళ్ కార్యక్రమంతో తిరిగి వార్తల్లోకి వచ్చిన నమిత ఈ పుకార్లతో ఇంకోసారి సెన్సేషన్ అయింది.
వదంతులు
అయితే శరత్‌బాబుతో ప్రేమ వ్యవహారం గురించి ఎన్నాళ్లగానో వదంతులు వున్నా వాటిపై ఎప్పుడూ స్పందించని నమిత పెళ్లి పుకార్లకి మాత్రం ఇమ్మీడియట్‌గా ఫుల్స్టాప్ పెట్టింది. ప్రస్తుత రోజుల్లో రూమర్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో అయితే ప్రతి ఒక్క సెలబ్రెటీ కి ఏదైనా ఒక రూమర్ చాలా ఇబ్బంది పెట్టక తప్పదు.