»   » కాంట్రవర్సీ అవ్వదు కదా...! కులం పేరుతో బాలయ్య తర్వాతి సినిమా ??

కాంట్రవర్సీ అవ్వదు కదా...! కులం పేరుతో బాలయ్య తర్వాతి సినిమా ??

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి బిగ్గెస్ట్‌హిట్ తర్వాత బాలకృష్ణ తర్వాతి సినిమా ఎలా ఉండబోతోందో అన్న చర్చ కొంచం సీరియస్గానే సాగింది. అటు చిరంజీవి 151 రాక ముందే బాలయ్య 101 సినిమా రావాలన్న పట్టుదల తోనూ, అదీ మంచి బలమైన కథ తో ఉండే విదంగానూ ఉండాలనుకున్న నందమూరి బాలయ్య ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ తో తెరమీదకి వచ్చాడు. పూరీ జగన్నాథ్ తో తన తర్వాతి సినిమా ఉండబోతోందంటూ అందరికీ చిన్న పాటి షాక్ ఇచ్చాడు.

102 కోసం ప్రయత్నాలు

102 కోసం ప్రయత్నాలు

ఇంకా పేరు ఖరారు కాని సినిమా సెట్మీదకు వెళ్ళిపోవటమే కాదు వేగంగా రెడీ అయిపోతోంది కూడా. ఈ సినిమాకోసం గాయకుడిగా కూడా మారిన బాలయ్య ఆ పాట పాడే సందర్భం లో కనిపించిన లుక్ చూడగానే అర్థమైపోయింది. మాంచి పవర్ ప్యాక్డ్ సబ్జెక్ట్ తోనే బాలకృష్ణ రాబోతున్నాడూ అని. ఇక అభిమానులైతే అప్పుడే సినిమా హిట్ అన్నంత హ్యాపీగా ఉన్నారు. అంతలా మెస్మరైజ్ చేసేసింది బాలయ్య లుక్. అయితే అసలు ఈ సినిమా పూర్తి కాకుండానే 102 కోసం కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు బాలయ్య.

రెండు టైటిల్స్‌

రెండు టైటిల్స్‌

ఇప్పుడు రానున్న ఈ సినిమా కోసం బాలయ్య కాల్షీట్స్ ఇవ్వడమే లేట్.. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్దామా అని ఎదురుచూస్తున్నారు దర్శకుడు. అయితే ఈ సినిమా కోసం ఇప్పటికే రెండు టైటిల్స్‌ను కూడా అనుకున్నట్లు తెలుస్తోంది. అవేమిటంటే రెడ్డి గారు, జయసింహ.

రెడ్డి, సింహా

రెడ్డి, సింహా

బాలయ్య కెరీర్‌లో రెడ్డి, సింహా అనే పదాలు కీలకపాత్ర పోషించాయి. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి ఇలా రెడ్డి పేర్లతో వచ్చిన సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. ఇక సింహా సెంటిమెంట్ గురించి చెప్పనక్కర్లేదు. మొదటినుండి బాలయ్య చేసిన సినిమాలు లక్ష్మీనరసింహ, సింహా, నరసింహనాయుడు ఇలా ఆయన సింహా అనే పదం వాడిన ప్రతిసారి హిట్ కొడుతూనే ఉన్నాడు.

లెజెండ్ తర్వాత

లెజెండ్ తర్వాత

అందులోనూ బాలయ్య మంచి ఫ్యాక్షన్ సినిమా చేసి చాలా రోజులే అయ్యింది లెజెండ్ తర్వాత మళ్ళీ అలాంటి పాత్రలో నటించాలన్నది అభిమానుల కోరిక కూడా. పూర్తి ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు "రెడ్డిగారు" టైటిల్‌ అయితే కరెక్ట్‌గా యాప్ట్‌ అవుతుందని భావిస్తున్నాడట దర్శకుడు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కులాల గొడవలు కూడా ఎక్కువే అవుతూండటం తో కాస్త ఆలోచిస్తున్నట్టు సమాచారం... ఈ టైటిల్‌కు బాలయ్య ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉందట

English summary
Ravi Kumar narrated a subject to Balakrishna got a nod from him. The makers are already considering the Jaya Simha and Reddy Garu for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu