»   » అన్ని కోట్లా?....నందమూరి హీరోను టాప్ లిస్టులో చేర్చేందుకు ప్లాన్!

అన్ని కోట్లా?....నందమూరి హీరోను టాప్ లిస్టులో చేర్చేందుకు ప్లాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో హీరో ఇమేజ్ ఎంత బావుంటే ఉంటే సినిమాకు అంత మంచి కలెక్షన్స్ వస్తాయి. మరి అంత మంచి ఇమేజ్ రావడం అంటే ఆషామాషీ కాదు. భారీ హిట్లు, మంచి కలెక్షన్లు సాధించిన సినిమాలు ఆ హీరో ఖాతాలో కనీసం రెండు మూడైనా ఉండాలి.

ఇలాంటి స్టార్ ఇమేజ్ కోసం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. కెరీర్లో రెండు మూడు హిట్లున్నా.... అంతకంటే ఎక్కువ ప్లాపులు ఉండటంతో అతని స్టార్ ఇమేజ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. ఇలా అయితే తాను స్టార్ హీరో కావడం సాధ్యం కాదని భావించిన ఆయన.... ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు.


ఈ క్రమంలో ఆయనకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ తో సినిమా సెట్టయింది. ప్రస్తుతం 'ఇజం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మనం గతంలో ఎన్నడూ చూడని కళ్యాణ్ రామ్ ను చూడబోతున్నాం.


ఈ సినిమాలో పూరి తన క్రియేటివిటీ మొత్తం ప్రయోగిస్తున్నాడు. మన ఊహకు కూడా అందని విధంగా కళ్యాణ్ రామ్ సూపర్ స్టైలిష్ గా చూపించబోతున్నాడు. అంతే కాదు ఇలాంటి పాత్రలు కళ్యాణ్ చేయగలడా? అనే రేంజిలో అతని పెర్ఫార్మెన్స్ స్టైల్ ను చాలా మార్చేసాడట పూరి.


పూరి లాంటి డైరెక్టర్.... కళ్యాణ్ రామ్ లాంటి మామూలు హీరో కోసం తన టైమ్ ను, టాలెంటును ఖర్చు చేస్తున్నాడంటే.... అందుకు ప్రతి ఫలంగా భారీగానే పుచ్చుకోవడం ఖాయం. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...


డీల్ ఎంత?

డీల్ ఎంత?

కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇజం' సినిమా కోసం పూరీ రూ.8 కోట్లు ఇచ్చేలా డీల్ సెటిలైందని అంటున్నారు.


కళ్యాణ్ రామే నిర్మాత..

కళ్యాణ్ రామే నిర్మాత..

తానే నిర్మాత కాబట్టి...తన భవిష్యత్ కోసం పూరి అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి సిద్దమయ్యాడు కళ్యాణ్ రామ్.


మామూలుగా లేదు..

మామూలుగా లేదు..

డైరక్టర్‌కే ఎనిమిది కోట్లు ఇచ్చారంటే.. మిగతా ఖర్చులన్నీ కలిపి బడ్జెట్‌ ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


బడ్జెట్

బడ్జెట్

పూరి స్టైల్ మేకింగ్ రావాలంటే ఈ సినిమాకు కనీసం రూ.25 కోట్లు అవ్వడం ఖాయం అంటున్నారు.


రిస్క్ చేస్తున్నాడు కానీ..

రిస్క్ చేస్తున్నాడు కానీ..

కళ్యాణ్ రామ్ తన సినిమాకు ఇంత ఖర్చు పెట్టి రిస్క్ చేస్తున్నప్పటికీ.... పాజిటివ్ రిజల్ట్ వస్తే తన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు, తన స్టార్ ఇమేజీ కూడా బాగా పెరుగుతుందని భావిస్తున్నాడట.


షూటింగ్

షూటింగ్

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో జరిగింది. దీంతో పాటు స్పెయిన్‌లో ఓ భారీ షెడ్యూల్‌ ప్లాన్ చేసారు.


రిలీజ్

రిలీజ్

సెప్టెంబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అపుడు వీలు కాకుంటే అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


నటీనటులు

నటీనటులు

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు,


English summary
Puri Jagannadh has taken a record remuneration for his forthcoming film ISM, starring Kalyan Ram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu