»   » పూరి సంచలన కామెంట్: చిరంజీవి, మహేష్ బాబులను ఉద్దేశించేనా?

పూరి సంచలన కామెంట్: చిరంజీవి, మహేష్ బాబులను ఉద్దేశించేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా తన హవా కొనసాగించిన పూరి జగన్నాథ్ ఈ మధ్య కొన్ని ప్లాపుల కారణంగా కాస్త వెనక పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కళ్యాణ్ రామ్ తో చేసిన 'ఇజం' నిన్న రిలీజైంది. సినిమా రిలీజ్ ముందు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా మీడియా వారు సంధించిన కొన్ని ప్రశ్నలకు పూరి తనదైన రీతిలో స్పందించారు. ఈ సందర్భంగా కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేసారు. స్వయంగా ఆయన పలానా స్టార్ హీరో పేరు ప్రస్తావించక పోయినా... ఆయన కామెంట్స్ చిరంజీవి, మహేష్ బాబులను ఉద్దేశించినట్లు ఉన్నాయంటున్నారు.

లైఫ్ లో రిస్క్ తీసుకోవాలి

లైఫ్ లో రిస్క్ తీసుకోవాలి

ఓ ప్రశ్నకు పూరి స్పందిస్తూ...లైఫ్‌లో రిస్క్ తీసుకునే స్టామినా ఉంటే ఏమైనా చేయొచ్చు. కానీ తెలుగులో చాలా మంది మంది స్టార్స్ రిస్క్ చేయడానికి భయ పడుతున్నారంటూ పూరి తనదైన రీతిలో కామెంట్ చేసారు.

ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

టాలీవుడ్లో కొత్త కథలు రావడం లేదంటున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ.... కొత్త కథ చేద్దాం అనే భావన వారిలో ఉంటే కొత్త కథలు, కథనాలు వస్తాయి. లేదూ అదే మూస ధోరణిలో వెళ్దాం. రీమేక్‌లనే నమ్ముకుందాం అంటే వాళ్లు కొత్త కథలను సినిమాలుగా తీయలేరు. చాలా మంది హీరోలు కొత్త కథలను అంగీకరించే ధైర్యం లేక రీమేక్‌లపై ఆధారపడుతున్నారని పూరి కామెంట్ చేసారు.

చిరంజీవిని పరోక్షంగా?

చిరంజీవిని పరోక్షంగా?

పూరి కామెంట్స్ పరోక్షంగా చిరంజీవి ఉద్దేశించి చేసినవే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలుత చిరంజీవి 150వ సినిమా పూరితోనే ఖరారైన సంగతి తెలిసిందే. కథ విషయంలో ఇద్దరి మధ్య తేడా రావడంతో పూరిని పక్కకు తప్పించి వినాయక్ తో... తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి.

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబుతో పూరి ‘జన గణ మన' మూవీ చేస్తున్నట్లు కూడా ఆ మధ్య ప్రకటించారు. కథ నచ్చిందని చెప్పిన మహేష్ బాబు డేట్స్ మాత్రం ఇవ్వ లేదట. అయితే సినిమా చేస్తాడా? లేదా? అనే విషయమై మహేష్ బాబు సరైన క్లారిటీ ఇవ్వక పోవడంపై కూడా పూరి కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చేస్తారో? లేదో? ఏదో ఒకటి చెప్పాలి.... ఉలుకు పలుకు లేకుండా ఉంటే ఎదుటి వారి టైం వేస్ట్ చేసినట్లే అని ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.

English summary
Tollywood director Puri Jagannadh indirect comments about Chiranjeevi 150 movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu