»   » పైసా వసూల్ కోసం క్రేజీ సాంగ్ రీమిక్స్ : ఎన్టీఆర్ పాట రీమిక్స్ లో బాలయ్య

పైసా వసూల్ కోసం క్రేజీ సాంగ్ రీమిక్స్ : ఎన్టీఆర్ పాట రీమిక్స్ లో బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్‌ఫుల్‌ డైలాగులంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే స్టార్‌ హీరో బాలకృష్ణ. ఇక, హీరోయిజమ్‌ను ప్రతి సీన్‌ సీన్‌కీ పైపైకి తీసుకువెళుతూ, పంచ్‌ డైలాగులతో థియేటర్‌లోని ప్రేక్షకులకు మాంచి ఫుల్‌ మీల్స్‌ అందించే దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే యమా క్రేజ్‌ నెలకొంది.

ఫస్ట్ లుక్ రిలీజ్

ఫస్ట్ లుక్ రిలీజ్

అసలు వరుస ఫ్లాపుల్లో కొట్టుకుంటోన్న పూరీ జగన్నాధ్ కి కూడా ఓక్ ఊపు వచ్చేసింది సినిమా మొదలైనప్పటి నుంచి దీని విశేషాలేంటన్నది బయటికి రాలేదు.షూటింగ్ జరుగుతున్న స్థలాలు తప్ప మిగతా విషయాలేవీ ఎవ్వరికీ అందకుండా జాగ్రత్త పడ్డారు. ఫస్ట్ లుక్ రిలీజ్ తోనే ఒక్క జలక్ తగిలింది జనాలకి అసలు కలలో కూడా ఊహించని గెటప్ తో బాలయ్య కనిపించేసరికి ఒక్కసారి అసలు సినిమా రూపమే మారిపోయింది..,


బాలయ్య మాట్లాడాడు

బాలయ్య మాట్లాడాడు

రెండింతలు అంచనాలు పెరిగాయ్, ఇక ఫ్యాన్స్ గురించి చెప్పేదేముందీ.. సినిమాలో ఏం ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది... అందుకే బాలయ్య స్వయంగా ఈ సినిమా గురించి మాట్లాడాడు.. ఇంతకీ తేడాసింగ్ ఉరఫ్ ఉస్తాద్ అలియాస్ పైసా వసూల్ హీరో ఏం చెప్పాడూ అంటే


చాలా అంచనాలు ఉన్నాయి

చాలా అంచనాలు ఉన్నాయి

"పూరి జగన్నాథ్.. నేను ఒకటే టైపు. ఇద్దరం బాగా కలిసిపోయాం. ఆయన క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆర్టిస్టులను చక్కగా ఉపయోగించుకుంటూ చకచకా షూటింగ్ చేస్తారు. మా తొలి కాంబినేషన్ మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. వాటన్నిటినీ మించేలా ఈ సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను.


పూరి రాసిన పంచ్ డైలాగులు

పూరి రాసిన పంచ్ డైలాగులు

ఒక సినిమా ఎలా ఉండబోతోందన్నది షూటింగ్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ కావచ్చు. ‘పైసా వసూల్' విషయంలో అదే జరుగుతోంది. పూరి రాసిన పంచ్ డైలాగులు అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఉంటాయి. ఈ సినిమాలో కథలో.. హీరో క్యారెక్టరైజేషన్లో చాలా ప్రత్యేకతలున్నాయి.


కంటి చూపు చెబుతోంది... కొంటె నవ్వు చెబుతోంది

కంటి చూపు చెబుతోంది... కొంటె నవ్వు చెబుతోంది

ఆడియో గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అనూప్ అద్భుతమైన బాణీలిచ్చాడు. నాన్న గారు నటించిన పాపులర్ మూవీ ‘జీవితచక్రం'లోని ‘కంటి చూపు చెబుతోంది... కొంటె నవ్వు చెబుతోంది... మూగమనసులో మాట ఓ పిల్లా...' అనే పాటను రీమేక్స్ చేశాం. ఆ పాటను అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే నేను తొలిసారిగా ఓ పాట పాడా. అదీ ఆకట్టుకుంటుంది. ఇంకా ఐటెం సాంగ్.. మాస్ సాంగ్ ఉన్నాయి'' అని బాలయ్య చెప్పాడుEnglish summary
The sources are now saying Puri Jagannadh is "Kontechoopu chebutondi" remix The song from Jeevitha chakram movie for Balakrishna's 101 Paisa Vasool.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu