పబ్‌లో రచ్చ రచ్చ చేసిన పూరి జగన్నాథ్, చార్మి (వీడియో వైరల్)
హీరోయిన్ చార్మి ప్రస్తుతం నటిగా సినిమాలు చేయడం తగ్గించేసి పూరి జగన్నాథ్‌తో కలిసి నిర్మాణ రంగంలో బిజి అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మెహబూబా'కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. చిత్ర బృందం అంతా కలిసి పార్టీ చేసుకున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది.
పూరి, చార్మి రచ్చ రచ్చ
పూరి జగన్నాథ్, చార్మితో పాటు హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ నేహా శెట్టి ‘మెహబూబా' కా స్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఇటీవల పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో ఛార్మి, పూరి ఇతర యూనిట్ సభ్యులు డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.

‘మెహబూబా'
‘మెహబూబా' సినిమా వివరాల్లోకి వెళితే 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో లవ్ స్టోరీ. ఈ చిత్రం ద్వారా తన కుమారుడిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు పూరి. అందుకే తనే స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.

రెండు జన్మలు
ఈ సినిమా కథలో హీరో హీరోయిన్లు ఇద్దరికీ రెండు జన్మలుంటాయని, గతంలో చనిపోయిన ఇద్దరూ మళ్ళీ ప్రస్తుతంలో పుట్టడం వంటి ఆసక్తికరమైన పాయింట్ ఈ కథలో ఉందని సమాచారం. మరి పూరి ఈ ఆసక్తికరమైన కథను తన టేకింగ్ తో ఇంకెంత ఆసక్తికరంగా తెరకెక్కిస్తారో చూడాలి.

అందరిలోనూ ఆసక్తి
మంగళూరు మోడల్ నేహా శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. హిమాచల్, పంజాబ్, రాజస్థాన్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా పూరీ స్టైల్ నే కొత్తగా మార్చేసే మేకింగ్ తో వస్తుందీ అన్న టాక్ రావటంతో ఈ సినిమా కోసం ఇటు ఇండస్ట్రీ వర్గాలు, అటు కామన్ ఆడియెన్స్ ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











