»   » చిరంజీవి 150వ సినిమాపై రామ్ చరణ్ ట్విస్ట్

చిరంజీవి 150వ సినిమాపై రామ్ చరణ్ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా నుండి పూరి జగన్నాథ్ తప్పుకున్నట్లు గత కొంత కాలంగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తను భాగస్వామిగా ఉన్న ట్రజెట్ విమానయాన సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ విషయమై రామ్ చరణ్ స్పందించారు.

నాన్న 150వ సినిమా నుండి పూరి జగన్నాధ్ ఇంకా తప్పుకోలేదు. సెకండాఫ్ కథ, స్క్రిప్టు వర్క్ ఇంకా పూర్తి కానందునే జాప్యం జరుగుతుందని రామ్ చరణ్ స్పష్టం చేసారు. నాన్నకు సెకండాప్ నచ్చితే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఒక వేళ పూరి దర్శకత్వమే ఫైనల్ అయితే ఆ చిత్రానికి ఆటోజానీ టైటిల్ పెడతామన్నారు. వివి వినాయక్ కూడా చిరంజీవి 150వ సినిమాపై ఆసక్తి చూపుతున్న రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ మాటలు బట్టి చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ ఖరారు కాలేదన్నమాట. రామ్ చరణ్ ఇచ్చిన ట్విస్టుతో అభిమానులు అయోమయంలో పడ్డారు.

 Puri Jagannadh not out from Chiranjeevi 150

అదే విధంగా వచ్చే ఏడాది బాబాయ్ పవన్ కళ్యాణ్ నిర్మాతగా తాను ఓ సినిమా చేస్తున్నట్లు రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.

English summary
"Puri Jagannadh not out from Chiranjeevi 150" Ram Charan said.
Please Wait while comments are loading...