»   » రెండు దేశాలూ, రెండు మతాలు: పూరీ కొత్త తరహా సినిమా "మెహబూబా"

రెండు దేశాలూ, రెండు మతాలు: పూరీ కొత్త తరహా సినిమా "మెహబూబా"

Posted By:
Subscribe to Filmibeat Telugu
డాషింగ్ డైరెక్టర్ పూరీ సినిమా : ఇండియా - పాకిస్థాన్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరితో ఒక సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ సినిమాతో మరోసారి నిరాశపరిచిన ఈ డాషింగ్ డైరెక్టర్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ముందునుంచి అనుకుంటున్నట్టుగానే తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా రీ లాంచ్ చేస్తూ సినిమాను తెరకెక్కించనున్నాడు.

స్క్రిప్ట్ పూర్తయింది

స్క్రిప్ట్ పూర్తయింది

ఈరోజు తన పుట్టినరోజు సందర్బంగా పూరి ఈ చిత్రాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అంతేగాక సినిమా ఎలా ఉండబోతోందో కూడా వివరించారు. ‘సినిమా స్క్రిప్ట్ పూర్తయింది. ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ. 1971 ఇండో-పాక్ యుద్ధం నైపథ్యంలో సాగే సినిమా. ఇది నా తరహా సినిమాలకి పూర్తి భిన్నమైంది' అన్నాడు.

మెహ‌బూబా

మెహ‌బూబా

సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆదే.."మెహ‌బూబా". ఇండియా - పాకిస్థాన్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఇది. 1971లో ఇండో - పాక్ వార్ జ‌రిగింది. అప్పుడు న‌డిచిన ఓ ప్రేమ‌క‌థ ఇది. క‌థానాయిక‌గా నేహా శెట్టిని ఎంపిక చేసుకొన్నారు. పిరియాడిల్ సినిమా చేయ‌డం పూరికి ఇదే తొలిసారి.

సందీప్ చౌతా సంగీతం

సందీప్ చౌతా సంగీతం

త‌మిళ‌, హిందీ జ‌నాల‌కూ అర్థ‌మ‌య్యేలా టైటిల్ ఎంచుకోవ‌డం బ‌ట్టి చూస్తే... ఇది మిగిలిన భాష‌ల్లోనూ డ‌బ్ చేసి విడుద‌ల చేస్తారేమో అనిపిస్తోంది. వ‌చ్చే నెల‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.సూపర్ సినిమా తరువాత మరోసారి పూరి సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నాడు.

నేహా శెట్టి హీరోయిన్

నేహా శెట్టి హీరోయిన్

మంగళూరు మోడల్ నేహా శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. హిమాచల్, పంజాబ్, రాజస్థాన్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, అటు కామ‌న్ ఆడియెన్ ఈ సినిమాపై ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
Puri Jagannadh on Thursday said he was all set to launch his son Akash Puri with upcoming Telugu film "Mehbooba", an intense love story set against the backdrop of the 1971 India-Pakistan war.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu