»   » పూరి జగన్ ని కాదని బాలయ్య డైరక్టర్ తో ఖరారు

పూరి జగన్ ని కాదని బాలయ్య డైరక్టర్ తో ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాధ్ తో ప్రాజెక్టు అంతా ఫైనల్ అనుకున్న సమంయలో ప్రాజెక్టు డీల్ ఛేంజ్ అయ్యింది. సీన్ లోకి గతంలో బాలకృష్ణతో మిత్రుడు చిత్రం డైరక్ట్ చేసిన మహదేవ్ వచ్చారు. ఇంతకీ ఏమా ప్రాజెక్టు...ఏమా కథ అంటే...మీరు పూర్తిగా చదవాల్సిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ గౌడ హీరోగా లాంచ్ చేయాలని మన తెలుగు దర్శకులు చుట్టూ చక్కర్లు కొట్టారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ తో ఈ చిత్రం లాంచ్ చేయాలని ప్రయత్నించారు. అయితే అనుకోని విధంగా సీన్ లోకి మహాదేవ్ వచ్చారు. మహాదేవ్ తో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు జాగ్వార్‌ టైటిల్ తో సినిమా రూపొందనుంది.

Puri Jagannadh Says No To Kumarswamy's Son Nikhil Gowda!

బెంగుళూరు లో మీడియా సమావేశంలో కుమారస్వామి ఈ విషయాన్ని వెల్లడించారు. నిఖిల్‌ను సినిమాల్లో పరిచయం చేసేందుకు తెలుగు దర్శకులు పూరిజగన్నాథ్‌, సుకుమార్‌లతో సంప్రదించానని చివరకు మహదేవను ఎంపిక చేసినట్లు చెప్పారు. దీన్ని కన్నడతో పాటు తెలుగులో కూడా రూపొందిస్తామని చెప్పారు. ఆగస్టులో చిత్రీకరణ ఆరంభం కానుంది.

అలాగే...ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథను సిద్ధం చేశారు. రాజమౌళి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి, బాలయ్యతో మిత్రుడు చిత్రం డైరక్ట్ చేసిన మహదేవ ఈ సినిమాకు దర్శకుడు. చెన్నాంబికా ఫిలింస్‌ పతాకంపై దీన్ని రూపొందిస్తారు. నిఖిల్‌ గౌడతో మాట్లాడిన తరువాత ఆయనలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక కథను రూపొందించినట్లు విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

English summary
Puri Jagannadh says no to Kumarswamy's son Nikhil Gowda! Yes, the maverick director of Telugu film industry has moved out from Nikhil Gowda's debut project Jaguar. His father Kumarswamy has selected SS Rajamouli's assistant Mahadev to say the action-cut for Jaguar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu