For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Puri Jagannadh: లైగర్ ఫ్లాప్ పై చిరుతో పూరి.. సంతోషపడిందే ఎక్కువ.. నమ్మినవాళ్లే అలా అంటూ

  |

  ఒకరు తెలుగు చిత్రసీమకు మెగాస్టార్. మరొకరు టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్. అవును మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరిద్దరు కాంబినేషన్లో ఓ సినిమా పడాలని ఈ ఇద్దరి ఫ్యాన్స్ తోపాటు యావత్ ప్రేక్షక లోకం ఎదురుచూసింది. వీరిద్దరు కలిసి ఇటీవల గాడ్ ఫాదర్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రం సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిరంజీవిని డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైవ్ చాట్ లో ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో లైగర్ ఫ్లాప్ పై ఆసక్తికరంగా స్పందించాడు పూరి జగన్నాథ్.

  తక్కువ సమయంలోనే..

  తక్కువ సమయంలోనే..

  మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, లేడి సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరో సత్యదేవ్ తో పాటు అలనాటి స్టార్ హీరో సర్వదమన్ బెనర్జి, అప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం బుల్లితెర నటి కస్తూరి, బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యా, గంగవ్వ, సునీల్ వంటి అనేకమంది నటీనటులతో వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 21 ఏళ్ల క్రితం హనుమాన్ జంక్షన్ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. సుమారు 21 ఏళ్ల క్రితం వచ్చిన హనుమాన్ జంక్షన్ మూవీకి ఆయన డైరెక్షన్ చేశారు.

  ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గోవర్ధన్ గా..

  ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గోవర్ధన్ గా..

  వీరందరితోపాటు డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గోవర్ధన్ గా పూరి జగన్నాథ్ ఆకట్టుకున్నారు. అక్టోబర్ 5న విజయ దశమి పండుగ సందర్భంగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిరంజీవిని ఇన్ స్టా గ్రామ్ లైవ్ ద్వారా ఇంటర్వ్యూ చేశాడు పూరి జగన్నాథ్. ఈ ఛాటింగ్ లో లైగర్ సినిమా పరాజయం గురించి ఆసక్తికరంగా స్పందించాడు పూరి జగన్నాథ్. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సక్సెస్ ఇచ్చే కిక్ ఎలా ఉంటుంది.. ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.

  నమ్మిన వాళ్లు కూడా రివర్స్ అయిపోతారు..

  నమ్మిన వాళ్లు కూడా రివర్స్ అయిపోతారు..

  ''స్క్రిప్ట్స్ అవి చూసుకుంటున్నావా? మనం అనుకున్న రిజల్ట్ రాకపోతే ఎలా తీసుకుంటారు?'' అని చిరంజీవి అడిగిన ప్రశ్నలకు.. ''ప్రస్తుతం మొంబైలో ఉన్నాను సార్. స్క్రిప్ట్స్ అవి చూసుకుంటున్నాను. ఇంకేం పనుంటుంది. అనుకున్న రిజల్ట్ రాకపోతే అంటే.. సార్.. సినిమా సక్సెస్ అయితే ఎనర్జీ వస్తుంది. ఫెయిల్యూర్ వస్తే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. సక్సెస్ ఉన్నప్పుడు జీనియస్ లా కనిపిస్తాం. అదే ఫెయిల్ అయితే ఫూల్ లా కనిపిస్తాం. ఒకసారి సినిమా చూసి నమ్మిన వాళ్లు, పనిచేసినవాళ్లు కూడా ఒక్కసారిగా రివర్స్ అయిపోతారు, స్లిప్ అయిపోతుంటారు, ఇలా రకరకాలుగా ఉంటాయి సార్. చాలా ప్రెషర్స్ వస్తాయి. ఆ టైమ్ లో ధైర్యంగా ఉండాలంటే చాలా స్ట్రెంత్ కావాలి. ఇప్పడు హీలింగ్ టైమ్ ను తక్కువ ఉండాలి తక్కువ పెట్టుకోవాలి అనుకుంటాను సార్.

  ఇంకో మూడేళ్లు ఏడవం కదా..

  ఇంకో మూడేళ్లు ఏడవం కదా..

  అంటే ఆస్తులు పోవచ్చు, అన్ని పోవచ్చు, యుద్ధాలు జరగొచ్చు. ఎన్ని జరిగిన హీలింగ్ (రికవరీ టైమ్) పీరియడ్ ఒక నెల కంటే ఎక్కువ ఉండకూడదు. అన్నీ వన్ మంత్ లో అయిపోవాలి. మళ్లీ తర్వాతి పని చేసుకోవాలి అంతే. సార్.. మొన్న లైగర్ సినిమా నేను సీరియస్ గా ఎంజాయ్ చేశాను సార్ నేను. ప్రొడక్షన్ గానీ, హీరో గానీ, యాక్టర్స్ తో.. మంచి సెట్ లు వేశాం, మైక్ టైసన్ తో షూట్ చేశాం. మూడేళ్లు ఎంజాయ్ చేశా. బట్ ఫెయిల్యూర్ వచ్చింది. మన చేతుల్లో లేదు. ఇంకో మూడేళ్లు ఏడవం కదా. చిన్నరోజుల్లోనే. కొన్ని రోజులే. ఇప్పుడు నా జీవితంలో లెక్కపెట్టుకుంటే నేను సంతోషంగా ఉన్న రోజులు ఎక్కువండి. బాధపడిన రోజులు తక్కువ'' అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. దీనికి సూపర్బ్ అంటూ అప్రిషియేట్ చేశారు చిరంజీవి. ఈ కన్వర్జేషన్ చూస్తే మోటివేషనల్ గా ఉండి, ఎన్నిసార్లు పడిన లేచేవాడే పూరి జగన్నాథ్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

  English summary
  Megastar Chiranjeevi And Director Puri Jagannath Conversation About Auto Johnny Movie In Godfather Promotion Video Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X