»   » 1700కి పైగా స్క్రీన్స్‌లో 'మెహబూబా' ట్రైలర్‌

1700కి పైగా స్క్రీన్స్‌లో 'మెహబూబా' ట్రైలర్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

'కృష్ణార్జున యుద్ధం' చిత్రంతోపాటు దాదాపు 1700కి పైగా స్క్రీన్స్‌లో 'మెహబూబా' ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

ట్రైలర్లో ఆకాష్ పూరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా వార్ సీన్లు, యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. ఈ సినిమాతో ఆకాష్ పూరికి నటుడిగా మంచి గుర్తింపు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్.

'దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక సైనికుడికే ఉంటుంది. ఆ మనసులో ఓ చిన్న స్థానం దొరికినా చాలు', 'మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం' అంటూ ట్రైలర్లో హీరో హీరోయిన్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

మే 11న సమ్మర్‌ స్పెషల్‌గా 'మెహబూబా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూరి ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్‌రాజు వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇడియట్', 'పోకిరి' చిత్రాలతో దిల్ రాజు అసోసియేట్ అయ్యారు. చాలా కాలం తర్వాత వీరి అసోసియేషన్లో 'మెహబూబా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Puri Jagannath’s Mehabooba Trailer will be Screened in 1700 theaters worldwide. Mehbooba movie is a romantic love story in the backdrop of 1971 Indo-Pak war written, directed and produced by Puri Jagan while Sandeep Chowta scored music for this movie. Puri Jagan's son Akash Puri and Manglorean beauty Neha Shetty are playing the main lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X