twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather:'ఇచ్చావులే తొక్కలో సలహా'.. పూరి జగన్నాథ్ గురించి 'గాడ్ ఫాదర్' విలన్ సత్యదేవ్ కామెంట్స్

    |

    మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ మూవీ రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ లో బ్రహ్మగా అదరగొట్టారు చిరంజీవి. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు రాగానే సినిమాపై అంచనాలు అమాంత పెరిగాయి. అందుకు అనుగుణంగానే గాడ్‌ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా విడుదల నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సత్యదేవ్ మాట్లాడిన విషయాల్లోకి వెళితే..

     చిరంజీవికి సోదరి పాత్రలో..

    చిరంజీవికి సోదరి పాత్రలో..


    మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 21 ఏళ్ల క్రితం హనుమాన్ జంక్షన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాను ఈ సినిమాకు డైరెక్టర్‌గా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన 'గాడ్ ఫాదర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో బడా స్టార్లు భాగమయ్యారు. ముఖ్యంగా ఈ మూవీలో చిరంజీవికి సోదరి పాత్రలో నయనతార, మాఫియా డాన్ రోల్‌లో సల్మాన్ ఖాన్ నటించడంతో ఆ అంచనాలు పెరిగిపోయాయి.

    అట్టహాసంగా సక్సెస్ మీట్..

    అట్టహాసంగా సక్సెస్ మీట్..


    ఇన్ని అంచనాల మధ్య విజయదశమి దసరా కానుకగా అక్టోబర్ 5న చాలా గ్రాండ్ గా విడుదలైంది చిరంజీవి గాడ్ ఫాదర్. సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సూపర్ అనే మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. సినిమా ఘన విజయం సాధించడంతో హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో చిత్రంలో నటించిన ఆర్టిస్టలందరూ తరలిరావడంతో వేదిక కళకళలాడింది. ఈ సందర్భంగా సీఎంగా నటించిన సర్వదమన్ బెనర్జీ, యూట్యూబర్‌గా పూరీ జగన్నాథ్, నయనతార, మురళీ శర్మ, సునీల్, షఫీ లాంటి నటీనటుల ప్రతిభను చిరంజీవి కొనియాడారు. అలాగే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ మరోస్థాయిని కల్పించిందని చిరంజీవి చెప్పారు. గాడ్‌ఫాదర్ సినిమా టైటిల్‌ను సజెస్ట్ చేసింది తమన్ అని అన్నారు.

    నన్ను బచ్చా' అనడం గర్వంగా ఉంది..

    నన్ను బచ్చా' అనడం గర్వంగా ఉంది..


    అనంతరం ఈ చిత్రంలో చిరంజీవికి విలన్ జయదేవ్ గా నటించిన యంంగ్ హీరో సత్యదేవ్ మాట్లాడారు. ''చిరంజీవి గారు సినిమాలో 'నన్ను బచ్చా' అనడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను. బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో అవకాశం దొరకడం నా అదృష్టం. ఈ సినిమా ద్వారా నాకు ఎంతో పేరు వచ్చింది. నన్ను నమ్మి ఈ మూవీ అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి పేరు నిలబెడతాను. ఒక రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు పూరి జగన్నాథ్ గారు కాల్ చేశారు. ఆయన ఒక డైలాగ్ చెప్పి.. ఎలా ఉందో చెప్పమన్నారు. 'అన్నయ్యతో సీన్ ఉంది. టెన్షన్ వచ్చేస్తుంది' అని పూరి అన్నారు. ఈ సినిమాలో పూరి గారు చేస్తున్నారనే విషయం నాకు అప్పటిదాగా తెలియదు.

    టిప్స్ చెప్పాలను అడిగారు..

    టిప్స్ చెప్పాలను అడిగారు..


    దీంతో మీరు చేస్తున్నారా సార్.. అని అడిగా. దీనికి.. అవును నాకు డైలాగ్స్ వచ్చాయని పూరి గారు చెప్పారు. తనకు టిప్స్ చెప్పాలను ఆయన అడిగారు. ఏం లేదు పూరి సార్.. కళ్లలోకి చూడకుండా డైలాగ్స్ చెప్పేయండి అని అన్నాను. పూరి గారు మళ్లీ నాకు సాయంత్రం కాల్ చేశారు. ఇచ్చావులే తొక్కలో సలహా. పనిచేయలేదు. నీకు సైట్ ఉంది. నాకు లేదు అని పూరి సార్ అన్నారు'' అంటూ సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. దీంతో చిరంజీవి, మురళీశర్మతోపాటు అక్కడున్న వాళ్లందరు తెగ నవ్వేశారు. కాగా ఇదే సక్సెస్ మీట్ లో మీడియాపై కొంత అసహనం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి.

    English summary
    Godfather Movie Villain Satyadev Comments On Director Puri Jagannath In Chiranjeevi Starrer Godfather Movie Success Meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X