»   » 1500 కోట్ల బాహుబలి: నిర్మాతలకు బెదిరింపులు, ముగ్గురు అరెస్ట్....

1500 కోట్ల బాహుబలి: నిర్మాతలకు బెదిరింపులు, ముగ్గురు అరెస్ట్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' చిత్ర నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని బెదిరించిన కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసారు. పాట్నాకు చెందిన రాహుల్ వర్మ, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'బాహుహులి' సినిమాను శాటిలైట్ ద్వారా పైరసీ చేసామని, వెంటనే తమకు రూ. 2 కోట్లు చెల్లించక పోతే సినిమాను ఇంటర్నెట్ లో విడుదల చేస్తామని నిందితులు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాతలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.... పాట్నా వెళ్లి వారిని పథకం ప్రకారం అరెస్టు చేసారు.


రూ. 1500 కోట్ల బాహుబలి

రూ. 1500 కోట్ల బాహుబలి

కాగా.... బాహుబలి-2 మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. పది రోజుల్లోపే రూ. 1000 కోట్ల గ్రాస్ సాధించి ఈ బ్రహ్మాండమైన మార్కును అందుకున్న తొలి సినిమాగా చరిత్ర సృష్టించిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. 20 రోజుల్లోపే రూ. 1500 కోట్ల గ్రాస్ సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది.


హిందీలో ఎదురులేని బాహుబలి-2

హిందీలో ఎదురులేని బాహుబలి-2

సౌత్ లో తెలుగు, తమిళ, మళయాల, కన్నడ ఇండస్ట్రీలతో పాటు... దక్షిణాది సినిమాలకు అంతగా ఆదరణ ఉండని బాలీవుడ్లోనూ బాహుబలి-2 ఎదురు లేకుండా దూసుకెలుతోంది. ఈ వారం విడుదలైన సర్కార్-3, మేరీ ప్యారీ బిందు సినిమాలను బాహుబలి-2 కలెక్షన్లపై ఏ మాత్రం ప్రభావంచూపలేక పోయాయి.


రూ. 2000 కోట్ల వైపు పరుగులు

రూ. 2000 కోట్ల వైపు పరుగులు

20 రోజుల్లోపే రూ. 1500 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ. 2000 కోట్ల మార్కును అందుకున్నా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.


హాలీవుడ్‌ సినిమాలకు చుక్కలు చూపించిన బాహుబలి-2 (వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం:)

హాలీవుడ్‌ సినిమాలకు చుక్కలు చూపించిన బాహుబలి-2 (వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం:)

హాలీవుడ్‌ సినిమాలకు చుక్కలు చూపించిl బాహుబలి-2.... అంటూ ప్రముఖ అమెరికన్ మేగజైన్ వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


వీళ్లకి ‘బాహుబలి’ విజయం కనిపించడం లేదా? వినిపించడం లేదా?

వీళ్లకి ‘బాహుబలి’ విజయం కనిపించడం లేదా? వినిపించడం లేదా?

తెలుగు సినిమా 'బాహుబలి-ది కంక్లూజన్' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించి ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టి నెం.1 స్థానంలో ఉన్నా కొందరు పట్టించుకోక పోవడంపై కోన వెంకట్ మండి పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

‘బాహుబలి' రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Three persons arrested in Patna for allegedly Blackmailing Baahubali 2 producers Prasad Devineni, Shobhu Yarlagadda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu