»   »  నెక్ట్స్ మెగాస్టార్ వరుణ్ తేజే...(ఆర్జీవీ రివ్యూ)

నెక్ట్స్ మెగాస్టార్ వరుణ్ తేజే...(ఆర్జీవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘లోఫర్' మూవీ చూసిన రామ్ గోపాల్ వర్మ వరుణ్ తేజ్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. నెక్ట్స్ మెగాస్టార్ వరుణ్ తేజే అంటూ కామెంట్ చేసారు. ఏ రకంగా చూసినా వరుణ్ తేజ్ లో మాత్రమే ఆ సత్తా ఉందంటూ ట్విట్టర్లో ట్వీట్స్ చేసారు. ఇలా ట్వీట్స్ చేయడం ద్వారా ఇతర మెగా ఫ్యామిలీ హీరోలకు ఆ సత్తా లేదని చెప్పుకనే చెప్పాడు వర్మ. అంతే కాకుండా లోఫర్ సినిమా గురించి తన వ్యూలో రివ్యూ రాసారు.

‘లోఫర్ మూవీ చూసాను. కమర్షియల్ మాస్ మసాలా సెంటిమెంటల్ ఎంటర్టెనర్. మ్యూజిక్, డ్రామా, యాక్షన్ ఈ మూడింటిని పూరి చాలా బాగా మిక్స్ చేసాడు అంటూ పూరి ట్వీట్ చేసారు.

వరుణ్ తేజ్ చాలా స్పీడుగా వేరియేషన్స్ చూపించాడు. ముకుంద, కంచె...ఇపుడు ‘లోఫర్' చూసిన తర్వాత టాలీవుడ్లో నెక్ట్ష్ మెగాస్టార్ అయ్యేది అతడే అని స్పష్టమవుతోంది అంటూ వర్మ ట్వీట్ చేసారు.

రేవతి, పోసాని పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ గా ఉంది. సునీల్ కవ్యప్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా చేసాడు. చాలా సంవత్సరాల నుండి హీరోయిన్లను చూస్తున్నాను. దిశా పటానీ బెస్ట్ హీరోయిన్. లోఫర్ సినిమాలో క్యారెక్టర్ లిమిటేషన్స్ ఉండటం వల్ల ఆమె టాలెంటును పూర్తిగా వాడుకోలేక పోయారు అంటూ ట్వీట్ చేసారు.

లోఫర్ మూవీలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ ను పూరి జగన్నాధ్ డిజైన్ చేసిన తీరు చాలా బావుంది. ఈ ఒక్క సినిమాతో వరుణ్ తేజ్ టాలీవుడ్లో మంచి రేంజికి ఎదిగాడు, ఇతర మెగా హీరోలకు మంచి పోటీ ఇస్తానని నిరూపించుకున్నాడు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేసారు.

వర్మట్వీట్


కమర్షియల్ మాస్ మసాలా సెంటిమెంటల్ ఎంటర్టెనర్

నెక్ట్ష్ మెగాస్టార్


టాలీవుడ్లో నెక్ట్స్ మెగాస్టార్ అయ్యేది వరుణ్ తేజే అంటూ వర్మ ట్వీట్ చేసారు.

రేవతి, పోసాని గురించి


రేవతి, పోసాని పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ గా ఉందిని ట్వీట్

దిశా పటాని గురించి


దిశా పటాని బెస్ట్ హీరోయిన్ అంటూ వర్మ ట్వీట్

English summary
"Seeing the speedy variation of Varun in Mukunda,Kanche and now especially "Loafer" I have no doubts that he's the next Mega Star" RGV tweeted.
Please Wait while comments are loading...