»   » వరుణ్ తేజ్ మరో సినిమా ఖరారైంది!

వరుణ్ తేజ్ మరో సినిమా ఖరారైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ నటించిన ‘కంచె' సినిమా బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్టయింది. దీని తర్వాత పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ నటించిన మూడో సినిమా ‘లోఫర్' త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ మరో సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.

వరుణ్ తేజ్ కెరీర్లో 4వ సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్ష‌న్‌, ల‌వ్ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవ‌లే వ‌రుణ్‌కి, నాగ‌బాబుకు గోపీచంద్ మలినేని క‌థ‌ను వినిపించారు. క‌థను వారిద్ద‌రూ ఓకే చేశార‌ని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి మొద‌లు కానుంది. న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Varun Tej's Next With Gopichand?

త్వరలో విడుదల కాబోతున్న వరుణ్ తేజ్ ‘లోఫర్' సినిమా విశేషాల్లోకి వెళితే...పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 18 డిసెంబర్ న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు తేదీ ని లాక్ చేసినట్లు సమచారం. అలాగే ఆడియోని నవంబర్ చివరి వారంలోకాని, డిసెంబర్ మొదటి వారంలోని విడుదల చేస్తారు.

ఈ చిత్రానికి డిఫెరెంట్ టైటిల్ పెట్టానని చెప్తున్న పూరి జగన్నాథ్ ..తాజాగా టైటిల్ మార్చారని సమాచారం. లోఫర్ అనే టైటిల్ ని వద్దనకుని మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వినికిడి. ఈ విషయమై అతి త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాసం ఉంది. ఈ చిత్రంలో అమ్మ పాత్రలో రేవతి కనిపించనుంది.

బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ సినిమా అంటేనే అదిరిపోయేలా ఐటం సాంగ్ ఉంటుంది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ పూరి జగన్నాథ్ అంచనాలకు ఏ మాత్రం తగట్గకుండా ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. మోరాకన్ డాన్సర్ నోరా పతేహితో ఈ చిత్రంలో స్పెషల్ ఐటం సాంగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

English summary
Film Nagar source said that, Varun Tej's Next With Gopichand Malineni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu