»   » చిరు, బాలయ్య, పవన్ తప్పు చేస్తున్నారా? ఇదీ తమ్మా రెడ్డి అభిప్రాయం...

చిరు, బాలయ్య, పవన్ తప్పు చేస్తున్నారా? ఇదీ తమ్మా రెడ్డి అభిప్రాయం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలైన... చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేయడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరు వెంట వెంటనే ఇన్ని సినిమాలు వేగంగా చేయడం వెనక 2019 రాజకీయాలకు లింక్ ఉందని, ఎక్కువ సినిమాలు చేసి వీలైనంత ఎక్కువ సంపాదించి.... ఆ డబ్బును 2019 ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఈ పరిణామాలపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. 'నా ఆలోచన' పేరుతో యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించే తమ్మారెడ్డి.....ఈ ఇష్యూపై స్పందిస్తూ
'హీరోలు ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేయడం తప్పు అని నేను భావించడం లేదన్నారు.

రాద్దాంతం చేస్తున్నారు

రాద్దాంతం చేస్తున్నారు

గతంలో చాలామంది హీరోలు ఇలా చేశారు. చిరంజీవి, బాలకృష్ణ గతంలోనూ ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అప్పుడు ఎవరూ అడగలేదు. ఇపుడు వారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా చూస్తున్నారు తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

సినిమాలు, రాజకీయాలు

సినిమాలు, రాజకీయాలు

సినిమా వాళ్లు రాజకీయాలు చేయడం తప్పు కాదు. రాజకీయాల్లో ఉంటూ కూడా సినిమాలు చేయొద్దని ఎక్కడా లేదు. రాజకీయాల్లో విఫలమయ్యాక కూడా సినిమాలు చేయొచ్చు. ఇందులో విమర్శించాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి అన్నారు.

తమ్మారెడ్డి మాట్లాడిన పూర్తి వీడియో

సినిమా యాక్టర్లు సినిమాలు, రాజకీయాలతో పాటు తెలుగు సినిమాల గురించి, పరిశ్రమలో వస్తున్న మార్పుల గురించి కూడా ఆయన చాలా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో పై వీడియోలో ఓ లుక్కేయండి.

సుచీ లీక్స్: ఇంత శాడిస్టులు ఎవరో తేల్చాలంటున్న తమ్మారెడ్డి

సుచీ లీక్స్: ఇంత శాడిస్టులు ఎవరో తేల్చాలంటున్న తమ్మారెడ్డి

సౌత్ సినీ పరిశ్రమను ‘సుచీ లీక్స్' వ్యవహారం షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా..... ఈ ఇష్యూపై సినీ స్టార్లు స్పందించడం లేదు. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై తమ్మారెడ్డి తనదైన రీతిలో స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Why Pawan Kalyan, Chiranjeevi and Balakrishna are acting in Movies? questions Tollywood Veteran Director Tammareddy Bharadwaj. He speaks about their Political Career and their Deeds. Finally, he reveals his wish that TFI / Telugu Film Industry should go International Wide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu