హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!!
Holi 2026: హోలీ పండుగ వచ్చేసింది. అయితే, అసలు పండుగ ఎప్పుడు జరుపుకోవాలి. ఇప్పుడు ఈ సందిగ్ధత చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. చంద్ర గ్రహణం రావటంతో హోలీ నిర్వహణ పైన డైలమా కొనసాగుతోంది. పండగ రోజే చంద్ర గ్రహణం కూడా సంభవిస్తుండటంతో ఆ రోజు జరుపుకోవచ్చా? లేదా? అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. అసలు పండుగ నిర్వహణతో పాటుగా పాఠశాలలు.. బ్యాంకుల సెలవు పైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.
సాంప్రదాయంగా ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలికా దహనం నిర్వహిస్తారు. ద్రిక్ పంచాంగం ప్రకారం హోలికా దహన్ తేదీ: 2026 మార్చి 3, మంగళవారం ముహూర్తం: సాయంత్రం 06:22 గంటల నుంచి రాత్రి 08:50 గంటల వరకు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా పౌర్ణమి తిథి ప్రారంభం: మార్చి 2, సాయంత్రం 05:55 గంటలకు పౌర్ణమి తిథి ముగింపు: మార్చి 3, సాయంత్రం 05:07 గంటలకు ముగుస్తుంది. గ్రహణ ప్రభావం కారణంగా మార్చి 2 సాయంత్రం హోలికా దహనం చేయాలని సూచిస్తున్నారు. మరికొందరు పంచాంగ నిపుణులు మాత్రం మార్చి 3 సాయంత్రంనే శాస్త్రోక్త ముహూర్తమని చెబుతున్నారు. అయితే, మార్చి 3నే హోలీ జరుపుకోవాలని మెజార్టీ పండితులు సూచిస్తుండటంతో ఆ రోజునే పండగ జరుపుకోవాలని నిర్ణయించారు.
నాడు సంజూ పై సూర్య వెటకారం, ఇప్పుడు టోపీ తీసి సెల్యూట్..!!

మార్చి 3న తెలుగు రాష్ట్రాల్లో సెలవు
RBI హాలిడే క్యాలెండర్ ప్రకారం.. హోలీతో సంబంధం ఉన్న వివిధ రోజుల్లో అనేక నగరాలు, రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి. మార్చి 2 సోమవారం రోజున హోలికా దహన్ సందర్భంగా కాన్పూర్, లక్నో వంటి కొన్ని నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి. మిగిలిన ప్రాంతాలలో మాత్రం బ్యాంకులు ఎప్పటిలాగే పనిచేస్తాయి. తెలుగు రాష్ట్రాలతో సహా పలు ఇతర రాష్ట్రాల్లో మాత్రం రేపు (మంగళవారం) సెలవు ప్రకటించారు.
ఏపీ, తెలంగాణలో ప్రభుత్వ కార్యలయాలు.. పాఠశాలలకు ఇప్పటికే రేపు (మార్చి 3) సెలవు ఇచ్చారు. అయితే.. చంద్రగ్రహణం తో పాటుగా హోలీ పండుగ జరుపుకోవటం పైన సందిగ్ధత కొనసాగుతున్న వేళ సెలవు పైన సందేహాలు మొదలయ్యాయి. కాగా.. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రేపు (మంగళవారం) సెలవుగా ఖరారు చేసారు. ముందుగా ప్రకటించిన సెలవులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తున్నారు.
Credit: Oneindia


Click it and Unblock the Notifications











