పేలిన బంగారం ధరల బాంబు

By Chandrasekhar Rao

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, అనిశ్చితుల మధ్య బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. పసిడి ధరల పెరుగుదలకు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం అయ్యాయి. పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. సేఫ్ హెవెన్ గా బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తోన్నారు. దీంతో వీటి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది.

స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,61,780 రూపాయలకు చేరింది. 22 క్యారెట్లు 1,48,300 రూపాయలు పలుకుతోంది. వెండి మాత్రం భారీగా తగ్గింది. సోమవారం నాటితో పోల్చుకుంటే కిలో వెండి ధరలో 15,000 రూపాయలకు పైగా తగ్గుదల కనిపించింది. రూ. 2,85,000 కు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,60,503 వద్ద స్వల్పంగా తగ్గగా, సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 2,63,800 వద్ద 0.58 శాతం తగ్గుదల నమోదు చేసింది.


Gold Rates Soars today as on the Geopolitical Tensions as Dollar Strength Lifts MCX Opens Higher

ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,450, 24 క్యారెట్లు రూ. 1,61,930 ల వద్ద నిలిచింది. అహ్మదాబాద్, పూణేల్లో 22 క్యారెట్లు రూ. 1,48,350, 24 క్యారెట్లు రూ. 1,61,830 వద్ద స్థిరపడింది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్లు రూ. 1,48,300, 24 క్యారెట్లు రూ. 1,61,780 గా నమోదయ్యాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,244, 22 క్యారెట్లు - రూ. 14,890, 18 క్యారెట్లు - రూ. 12,730

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు - రూ. 12,134

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు - రూ. 12,134

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు - రూ. 12,134

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు - రూ. 12,134

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,178, 22 క్యారెట్లు- రూ. 14,830, 18 క్యారెట్లు - రూ. 12,134

Credit: Oneindia

More from Filmibeat

Read more about: notification
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X