twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    21 years of puri Jagannath: 100 కోట్ల మోసం.. అయినా వెనక్కి తగ్గని పూరి, ఆ ఒక్క సంఘటనతో లైఫ్ చేంజ్

    |

    రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన వచ్చిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి దర్శకుడిగా మొదటి ఛాన్స్ అందుకోవాడనికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో సమస్యలు అర్థం చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి మొండిగా చేరుకున్నాడు. పూరి సినిమా అంటే అందులో పంచ్ డైలాగ్స్ పవర్ఫుల్ డైలాగ్స్ కామన్ అని తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. ఇక అతని మొదటి సినిమా వచ్చి నేటికి 21 ఏళ్లయ్యింది. ఈ కెరీర్ మొత్తంలో అతను విజయాలతో పాటు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు.

    సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

    తల్లిదండ్రుల సపోర్ట్ తోనే

    తల్లిదండ్రుల సపోర్ట్ తోనే

    పిఠాపురం నుంచి వచ్చిన పూరి కెరీర్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. దాదాపు ఆయన గురువు రామ్ గోపాల్ వర్మ తరహాలోనే తెలియకుండా తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ను సెట్ చేసుకున్నాడు. తల్లిదండ్రుల సపోర్ట్ తోనే పూరి దర్శకుడు అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

    అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

    రోడ్ల మీద షూటింగ్స్ జరిగితే..

    రోడ్ల మీద షూటింగ్స్ జరిగితే..

    ఇక మెల్లగా రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేసి ఆ తరువాత సొంతంగా ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేశాడు. రోడ్ల మీద షూటింగ్స్ జరిగినా కూడా అది అయిపోయే వరకు అక్కడే చూస్తూ ఉండేవాడు. ఘోస్ట్ రైటర్ గా దర్శకుడిగా కూడా పలు సినిమాలకు పని చేశాడు. ఇక బద్రి సినిమాతో పూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

    అలా మొదటి అవకాశం..

    అలా మొదటి అవకాశం..

    మొదటి అవకాశం కూడా అనుకోకుండానే వచ్చింది. పవన్ కళ్యాణ్ తో మొదట చేయాలనుకున్న సినిమా బద్రి కాదట. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పాలని అనుకున్నాడట. కానీ ఎందుకో పవన్ కు ఆ కథ సెట్టవ్వదని బద్రి కథను వినిపించాడు. బద్రి క్లైమాక్స్ పవన్ కావాలని అభ్యంతరం చెప్పినా కూడా చేంజ్ చేయలేదు. అందుకే అతని కమిట్మెంట్ కు విలువ ఇచ్చి బద్రి ఛాన్స్ ఇచ్చాడు.

    పురికి వెన్నతో పెట్టిన విద్య

    పురికి వెన్నతో పెట్టిన విద్య

    సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా పూరి ఇప్పటివరకు 35సినిమాలకు డైరెక్టర్ చేశాడు. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా హీరోలను మాస్ స్టైల్ లోనే పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయడం పురికి వెన్నతో పెట్టిన విద్య. ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలను కవర్ చేసేశాడు.

    100కోట్ల మోసం..

    100కోట్ల మోసం..

    ఇక సొంతంగా అప్పట్లో వైష్ణో ఆకాడమిని స్థాపించిన పూరి నిర్మాతగా కూడా మంచి లాభాలను అందుకున్నాడు. అయితే కొన్ని వ్యాపారులలో కొంతమందిని నమ్మి దాదాపు 100కోట్ల వరకు మోసపోవాల్సి వచ్చిందట. ఒక ఇంటర్వ్యూలో పూరి ఆ విషయంపై స్పందించాడు. ఆ మోసపోయిన సంఘటన తరువాత తన జీవితంలో ఎంతగానో మార్పు వచ్చిందని వివరణ ఇచ్చాడు.

    మొదటిసారి పాన్ ఇండియా సినిమా

    మొదటిసారి పాన్ ఇండియా సినిమా

    వరుస అపజయాల అనంతరం ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన పూరి కొత్తగా పూరి జగన్నాథ్ టాకీస్ అనే ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసాడు. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఒక భారీ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. లైగర్ అనే ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతొంది. ఆ సినిమాలో విజయ్ ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.

    English summary
    The fact that a Star Hero movie has come up on the sets means that the hustle and bustle that fans make from the movie announcement to the records after its release is not uncommon. It is common for fans to rush into any movie. Now that Puri is making a favorite hero movie with a director like Jagannath, that commotion dose is not normal. Vijay Devarakonda's new movie poster has now gone viral on social media..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X