For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prathyusha Unknown Facts: జీవితంలో చీకటి కోణాలు.. పూరీ జగన్నాథ్, రవితేజ మూవీని ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..

  |

  అతి తక్కువ కాలంలో తెలుగులోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్న ప్రత్యూష అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడటం ఇప్పటికి అందర్ని విషాదానికి గురి చేస్తుంది. అత్యంత వివాదాస్పద సంఘటనతో ప్రత్యూష మరణించడం అందర్నీ బాధకు గురిచేసింది. ఇప్పటికీ కూడా ఆమెను తలచుకొంటే హృదయం ముక్కలైనంత పని అవుతుంది. అయితే తన మరణానికి ముందు ఆమె జీవితంలో ఆసక్తికరంగా చోటుచేసుకొన్న కొన్ని సంఘటనల్లోకి వెళితే...

  మిస్ లవ్లీ స్మైల్‌గా

  మిస్ లవ్లీ స్మైల్‌గా

  తెలంగాణలోని భువనగిరిలో పుట్టిన ప్రత్యూష ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొన్నది. ఆ తర్వాత టెలివిజన్ స్టార్ 2000 అనే కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. ఆ పోటీలో మిస్ లవ్లీ స్మైల్ అనే కేటగిరిలో విజేతగా నిలిచింది. ఆ షో ద్వారా సినీ వర్గాల దృష్టిలో పడిన ప్రత్యూష సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది.

  Ananya Panday మరింత హాట్‌గా.. బికినీలో క్లీవేజ్‌ షో.. లైగర్‌లో విజయ్ దేవరకొండతో ఇక రచ్చే!

  మోహన్ బాబు రాయుడు చిత్రంతో

  మోహన్ బాబు రాయుడు చిత్రంతో

  ప్రత్యూష నట జీవితం డైలాగ్ కింగ్ మోహన్ బాబు చిత్రంతో ప్రారంభమైంది. మోహన్ బాబు హీరోగా రూపొందిన రాయుడు చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీరాములయ్య, సముద్రం, ఇది ఏమీ ఊరు రా బాబు, కలుసుకోవాలని లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. సినీ రంగంలోకి ప్రవేశించిన తక్కువ సమయంలోనే ప్రముఖులు, క్రిటిక్స్, అభిమానుల ప్రశంసలు అందుకొన్నది.

  Karthika Deepam అంజికి తలకు పిస్టల్ గురిపెట్టిన మోనిత.. తుపాకి పేలడంతో టెన్షన్‌లో దీప

  తమిళ చిత్ర పరిశ్రమలో హల్‌చల్

  తమిళ చిత్ర పరిశ్రమలో హల్‌చల్

  ప్రత్యూష కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాలేదు. పుంగోడి అనే తమిళ చిత్రంతో కోలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత సూపర్ కుటుంబం, పొన్నా నేరం, తవాసీ, కడై పూక్కల్, సౌండ్ పార్టీ లాంటి తమిళ చిత్రాల్లో నటించింది. తన మరణానికి ముందు కన్నడ సినిమాలో నటించడానికి అంగీకరించింది. దురదృష్టవశాత్తు ఆమె ఈ లోకం నుంచి వెళ్లిపోవడంతో గొప్పగా ఉంటుందని భావించిన ఆమె కెరీర్‌కు అర్ధాంతరంగా తెరపడింది.

  ప్రత్యూష మరణం వెనుక అనుమానాలు

  ప్రత్యూష మరణం వెనుక అనుమానాలు

  సినీ రంగంలో సక్సెస్ గ్రాఫ్ రివ్వును ఎగిరిపోతున్న సమయంలోనే సిద్దార్థ్ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రత్యూష, సిద్దార్థ్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ప్రత్యూష మరణించగా, సిద్దార్థ్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రత్యూష మరణం వెనుక అనేక అనుమానాలు ఇప్పటికీ వ్యక్తం అవుతున్నాయి.

  Vadinamma : పెను విధ్వంసం ప్లాన్ చేసిన పార్వతి.. అన్యాయం చేస్తారా అంటూ!

  ప్రత్యూష మరణంపై తల్లి ఆవేదన

  ప్రత్యూష మరణంపై తల్లి ఆవేదన

  అయితే తన కుమార్తెది హత్యే అంటూ ప్రత్యూష తల్లి సరోజిని దేవీ ఆరోపిస్తుంటారు. ఇప్పటికీ తన కుమార్తె మరణంపై నిజాలు బయటపెట్టాలని న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా ప్రత్యూష మరణంపై అనేక సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. పలుమార్లు టెలివిజన్ ఛానెల్స్‌లో సరోజిని దేవీ పలువురు రాజకీయ నేతలపై ఆరోపణలు చేశారు.

  ప్రత్యూష మరణానికి ముందు

  ప్రత్యూష మరణానికి ముందు

  ఇదిలా ఉంటే.. తన మరణానికి ముందు భారీ ప్రాజెక్టులు, అగ్ర నటుల చిత్రాల్లో నటించమని ఆఫర్లు వచ్చాయి. అప్పుడప్పుడే దర్శకుడిగా గుర్తింపు పొందుతున్న పూరీ జగన్నాథ్, రవితేజ కలిసి రూపొందించే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. రవితేజ, ప్రత్యూష మధ్య ఫోటో సెషన్ కూడా చేశారు. అందరూ ప్రత్యూషే హీరోయిన్ అనుకొన్నారు.

  పోర్న్ రాకెట్ నటి గెహానా వశిష్ట్ కళ్ళు చెదిరే ఫోటోలు.. మరీ ఇంతలా అందాల ఆరబోతా ?

  పూరీ జగన్నాథ్ మూవీలో

  పూరీ జగన్నాథ్ మూవీలో

  కానీ అదే సమయంలో తమిళ చిత్రంలో ఒక మంచి అవకాశం రావడంతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాను ప్రత్యూష వదులుకొన్నది. దాంతో పూరి జగన్నాథ్ సినిమాలో నటించే అవకాశాన్ని ఆమె జారవిడుచుకొన్నారు. ప్రత్యూషకు వచ్చిన ఆఫర్‌ను తనురాయ్ దక్కించుకొన్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం విడుదలై సంచలన విజయం సాధించింది. రవితేజ, పూరీ జగన్నాథ్‌కు మరింత పేరు తెచ్చిపెట్టింది.

  Parari Movie Official Motion Poster || Filmibeat Telugu
  పవన్ కల్యాణ్, ప్రత్యూష ఇద్దరూ మిస్

  పవన్ కల్యాణ్, ప్రత్యూష ఇద్దరూ మిస్

  ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా విషయానికి వస్తే.. వాస్తవానికి కథను ముందుగా పూరీ జగన్నాథ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు చెప్పారట. అయితే ఆ సినిమా పవన్ చేయకపోవడంతో రవితేజతో చేయడానికి పూరీ జగన్నాథ్ ఫిక్స్ అయిపోయారు. అలా రవితేజ స్టార్ హీరో అవ్వడానికి పవన్ కల్యాణ్ పరోక్షంగా దోహదపడ్డారు. ఈ సినిమాను అటు ప్రత్యూష, పవన్ కల్యాణ్ వదులుకోవడంతో రవితేజ, తనురాయ్ ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యారని సినీ వర్గాలు అంటాయి.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Actress Prathyusha's Unknown facts: She passed away in early age. As part of the career, She Misses Puri Jagannadh and Ravi Teja's itlu sravani subramanyam movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X