twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ మూవీపై కాపీ ఆరోపణలు, కేసు వేయకుండా రచ్చ చేస్తున్న ప్రముఖుడు!

    |

    యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన 'టెంపర్' మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో రణవీర్ సింగ్ హీరోగా 'సింబా' పేరుతో రీమేక్ చేయగా సూపర్ హిట్ అయింది. తాజాగా ఈ మూవీ తమిళంలో 'అయోగ్య' పేరుతో విశాల్ హీరోగా రీమేక్ అయింది.

    'టెంపర్' మూవీ విడుదలైన మూడేళ్ల తర్వాత... ఇపుడు ఈ కథ కాపీ అంటూ ఆరోపణలు తెరపైకి రావడం చర్చనీయాంశం అయింది. తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ ఈ ఆరోపణలు చేశారు. 1993లో వచ్చిన తన క్రైమ్ థ్రిల్ర్ 'ఉల్లే వెలియే' చిత్ర కథనే ఎత్తేసి 'టెంపర్' మూవీ చేశారని ఆయన వాదిస్తున్నారు. పార్తీబన్ ఆరోపణలతో 'అయోగ్య' చిత్రాన్ని వివాదంలోకి నెట్టివేశాయి.

    కేసులు పెట్టే ఆలోచన లేదు

    కేసులు పెట్టే ఆలోచన లేదు

    గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ కాపీ వివాదంపై ఫిర్యాదు చేసే ఆలోచనకానీ, కేసులు పెట్టే ఉద్దశ్యం కానీ తనకు లేదని తెలిపారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ‘అయోగ్య' చిత్రంలో పార్తీబన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తను నటించిన సినిమాపై తనే ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయింది.

    పూరి, వక్కంతం వంశీ ఎలా రియాక్ట్ అవుతారు?

    పూరి, వక్కంతం వంశీ ఎలా రియాక్ట్ అవుతారు?

    ‘అయోగ్య' చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ చేయడం కోసమే పార్తీబన్ కావాలని ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చినట్లు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే మరి పార్తీబన్ ఆరోపణలపై ‘టెంపర్' మూవీ దర్శకుడు పూరి జగన్నాథ్, కథ అందించిన వక్కంతం వంశీలు ఎలా స్పందిస్తారో చూడాలి.

    అయోగ్య

    అయోగ్య

    ‘అయోగ్య' చిత్రానికి వెంకట్ మోహన్ దర్శకత్వం వహించారు. తెలుగు వెర్షన్లో ఎన్టీఆర్ పోషించిన అవినీతి పోలీస్ పాత్రలో విశాల్ నటించగా.... ఆయనకు జోడీగా రాశీ ఖన్నా చేసింది. ఈ చిత్రం శుక్రవారం(మే 10)న విడుదలవ్వాల్సి ఉండగా ఫైనాన్షియల్ సమస్యల వల్ల ఒక రోజు ఆలస్యంగా శనివారం విడుదలైంది.

    ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్

    ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్

    ‘అయోగ్య' చిత్రానికి తమిళ బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది. విశాల్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అతడి కెరీర్లో మంచి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగడం, చెన్నై టీం తలపడటంతో తమిళ ప్రజలంతా మ్యాచ్ చూస్తూ టీవీలకు అతుక్కుపోవడంతో వసూళ్లు తగ్గాయి. సోమవారం నుంచి కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉంది.

    English summary
    Tamil actor and filmmaker Parthiepan, has now made an allegation stating that the story of Temper was stolen from his 1993 crime thriller, Ulle Veliye. However, he has no plans to sue them over copyright infringement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X