Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu Serial Weekly Roundup: పరువు పోయి కష్టాల్లో ఫ్యామిలీ.. మరోవైపు జానకి, రామ రొమాన్స్!
జానకి కలగనలేదు సీరియల్ జనవరి మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జనవరి 9 నుంచి జనవరి 13 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

జనవరి 9వ ఎపిసోడ్
మరోవైపు మల్లిక జానకి బాధలో ఉంటే మరింత ఘాటుగా మాట్లాడుతుంది. ఇంటి పరువు పోవడానికి ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది అని ఒక రాత్రిలో అంత డబ్బు రావడం కూడా కష్టమే అని మాట్లాడుతుంది. ఇక మల్లిక మాటలకు గోవిందరాజులు సీరియస్ అవుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడవాలి కానీ కళ్ళల్లో కారం కొట్టకూడదు అని ఆమెకు హెచ్చరిక చేస్తాడు. ఇక సైలెంట్ గా మల్లిక అక్కడ నుంచి వెళ్లి పోతుంది.
Janaki Kalaganaledu January 9th: అప్పు కోసం రామచంద్ర తిప్పలు.. బాధపెట్టేలా మల్లిక ప్రయత్నాలు

జనవరి 10వ ఎపిసోడ్
అంతే కాకుండా నువ్వు నాకు చెప్పకుండా నిన్నా మొన్న వచ్చిన నీ భార్యకు నిజం చెప్పావు. ఇక ఆమె కూడా అసలు విషయాన్ని నాతో చెప్పకుండా దాచి పెట్టింది. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు మీ నాన్నగారు మంచాన పడ్డారు అని జ్ఞానాంబ రామపై చాలా సీరియస్ అవుతుంది. అయితే రామచంద్ర 20 లక్షలు అప్పు తీర్చాలంటే మళ్ళీ మన స్వీట్ షాప్ తాకట్టు పెట్టాలి అని అనుకుంటాడు. ఇక ఆ విషయాన్ని తన తల్లితో కూడా చెప్పాలని అనుకుంటాడు.
Janaki Kalaganaledu January 10th: డబ్బు మొత్తం ఇవ్వాలని ఒత్తిడి.. రామ కారణంగా కుటుంబంలో గొడవలు!

జనవరి 11 వ ఎపిసోడ్
మరోవైపు మల్లికా మాత్రం ఆ ఇంట్లో ఉంటున్నందుకు చాలా కోపంగా ఉంటుంది. తన భర్తపై కోపాన్ని చూపిస్తూ ఎప్పుడు తల్లి వెంటే ఉంటారు అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక జానకి ఇంట్లో పాలు పొంగించాలి అని తన భర్తకు చెబుతుంది. అందుకోసం జ్ఞానాంబను కూడా అడుగుతుంది. కానీ జ్ఞానాంబ మాత్రం నాకు అధికారం లేదు అంటూ.. పెద్ద కోడలు వచ్చిన తర్వాత తనదే అధికారం అని చెప్పడంతో రామచంద్ర మొదట బాధపడతాడు. కానీ తర్వాత జానికి చేతుల మీదుగా పాలు పొంగిస్తారు. ఇక సంతోషంలో రామచంద్ర భార్యకు ముద్దు పెట్టుకుంటూ వంటగదిలోనే కౌగిలించుకుంటాడు.
Janaki
Kalaganaledu
January
11th:
సొంత
ఇంటిని
వదిలిన
జ్ఞానాంబ
ఫ్యామిలీ..
జానకితో
రామ
ముద్దులు!

జనవరి 12వ ఎపిసోడ్
మల్లిక
మాత్రం
ఎప్పటిలానే
పాలు
కావాలి
అని
చెప్పి
వెళ్ళిపోతుంది.
ఇక
పరిస్థితులు
ఎలా
ఉన్నా
కూడా
రామచంద్ర
జానకి
మాత్రం
సంతోషంగా
ఉండడానికి
ప్రయత్నం
చేస్తూ
ఉంటారు.
జానకి
పాలు
పొంగించడంతో
అతను
సంతోషంలో
ఆమెకు
ముద్దులు
పెడుతూ
కౌగిలించుకుంటూ
ఉంటాడు.
ఇక
తర్వాత
మరోవైపు
మల్లిక
మాత్రం
తలనొప్పి
బాబోయ్
అంటూ
నాటకం
ఆడుతూ
ఉంటుంది.
ఇక
తర్వాత
జానకి
గదిలోకి
వచ్చి
ఆమెకి
గుణపాఠం
చెప్పే
ప్రయత్నం
చేస్తుంది.
ఇక
ఇది
ఇలా
ఉంటే
మరోవైపు
జ్ఞానాంబ
చాలా
బాధలో
ఉండగా
రామచంద్ర
కూడా
తన
వల్లే
కుటుంబ
పరిస్థితి
ఇంత
దారుణంగా
ఉంది
అని
బాధపడుతూ
ఉంటాడు.
Janaki
Kalaganaledu
January
12th:
అప్పుల
బాధలో
జ్ఞానాంబ..
వంటగదిలో
జానకి,
రామ
కౌగిలింతలు!

జనవరి 13వ ఎపిసోడ్
జ్ఞానాంబ అయితే ఎంతో గౌరవంగా బ్రతికిన వాళ్ళము ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని అనుకోలేదు అని అంటుంది. కానీ గోవిందరాజులు మాత్రం ఆమెకు మరింత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. రామచంద్ర ఏదో ఒకటి చేస్తాడులే అంటూ ఆమెకు భరోసా ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఉదయాన్నే మళ్ళీ ఎప్పటిలానే జానకి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటుంది. ఇక ఆమె టిఫిన్ రెడీ చేస్తూ ఉండగా అప్పుడే రామచంద్ర వచ్చి త్వరగా నాకు టిఫిన్ పెట్టండి షాప్ కు వెళ్లాలి అని అంటాడు. కానీ షాప్ మాత్రం అప్పుల వాళ్ళు తీసుకున్నారు అనే విషయాన్ని రామచంద్ర గ్రహించలేక పోతాడు. సడన్ గా ఆ విషయం గుర్తుకు రాగానే బాధపడుతూ ఉంటాడు. మరి ఈ పరిస్థితులను దాటి జానకి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
Janaki Kalaganaledu January 13th: మల్లిక కఠినమైన మాటలు.. భర్త కోసం బాధను బరిస్తున్న జానకి