»   » జబర్దస్త్ లో బూతు స్కిట్లపై... నాగబాబు ఏమంటున్నారంటే!

జబర్దస్త్ లో బూతు స్కిట్లపై... నాగబాబు ఏమంటున్నారంటే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో ఈ మధ్య కాలం బాగా పాపులర్ అయిన కార్యక్రమం 'జబర్దస్త్ కామెడీ షో'. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా జడ్జిలుగా వ్యవహరిస్తుండం.... అనసూయ, రష్మి గ్లామర్ కూడా ఈ షో హిట్ కావడానికి దోహదం చేసాయి.

అయితే జబర్దస్త్‌లో కామెడీ స్కిట్లతో పాటు.... అప్పుడప్పుడు డబల్ మీనింగ్, బూతు మీనింగ్ వచ్చే స్కిట్లు కూడా రావడంపై ఆ మధ్య విమర్శలు వచ్చాయి. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయమై నాగబాబు స్పందించారు.

తాను జడ్జిగా వ్యవహరిస్తున్న కార్యక్రమం కాబట్టి.... నాగబాబు ఆచితూచి స్పందించారు. జబర్దస్త్‌లో అలాంటివి ఉండటాన్ని సమర్దిస్తూనే తనదైన రీతిలో రియాక్ట్ అయ్యారు.

 అలాంటివి కూడా భాగమే

అలాంటివి కూడా భాగమే

కామెడీలో వందకు పైగా రకాలున్నాయి. అందులో డబుల్ మీనింగ్, స్పైసీ కామెడీలు భాగమే. జబర్దస్త్‌లో డబుల్ మీనింగ్ స్కిట్‌లతో పాటుగా నీట్‌గా ఉండే స్కిట్‌లు కూడా చేస్తున్నారు. స్కిట్‌లో గీత దాటుతున్నప్పుడు ఒక జడ్జ్‌గా తాను హెచ్చరిస్తానని నాగబాబు తెలిపారు.

 ఇలా షో నా అదృష్టం

ఇలా షో నా అదృష్టం

జబర్దస్త్ మొదలు పెట్టినప్పుడు ఇంత పెద్ద హిట్టవుతుందని ఊహించలేదు. నిర్మాత శ్యాంప్రసాద్ గారు కేవలం పది ఎపిసోడ్లు అనుకుని మొదలు పెట్టారు. కానీ ఇది సూపర్ హిట్ అవ్వడంతో నాలుగేళ్లుగా కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలో కొన్ని సార్లు ఒకటీ అర స్కిట్లు అలాంటి దొర్లి ఉంటాయి. కానీ అంతకంటే ఎక్కువ మంచి స్కిట్లు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. ఇలాంటి షోలో భాగం కావడం నా అదృష్ట అని నాగబాబు తెలిపారు.

అన్నయ్య జోలికొస్తే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతా : నాగబాబు

అన్నయ్య జోలికొస్తే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతా : నాగబాబు

ఖైదీ నెం 150' సినిమా విడుదల ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు యండమూరి వీరేంద్రనాథ్, రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.... అపుడు తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా నాగబాబు స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 గోవాలో ఎంజాయ్ చేసారు: నాగ బాబు, రోజా, అనసూయ, జబర్దస్త్ టీం (వీడియో)

గోవాలో ఎంజాయ్ చేసారు: నాగ బాబు, రోజా, అనసూయ, జబర్దస్త్ టీం (వీడియో)

ఎప్పుడూ షూటింగులతో బిజీగా, పని ఒత్తిడితో ఉండే జబర్దస్త్ టీం.... అలా సరదాగా గడిపేందుకు గోవా వెళ్లారు.... పూర్తి వివరాలు ఫోటో కోసం క్లిక్ చేయండి.

English summary
Mega brother Naga Babu reaction about adult skits in Jabardasth comedy show. The Jabardasth with a tagline of Katharnak Comedy Show, is a Telugu TV comedy show, rated "5 star" among Telugu shows, and broadcast on the ETV channel, in Telugu States, India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu