For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable పోర్చుగల్‌లో బాలకృష్ణకు గర్ల్‌ఫ్రెండ్.. పేరు చెప్పి సీక్రెట్ లీక్ చేసిన పూరీ జగన్నాథ్

  |

  నటసింహం నందమూరి బాలకృష్ణ టాక్ షో హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తి దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్‌ను సొంతం చూసుకొని సంచలనం రేపారు. ఓ పక్క అఖండ విజయంతో సంచలనం రేపిన బాలయ్య.. హోస్ట్‌గా అందరిని మెప్పిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో బాలయ తన విశ్వరూపం చూపించారు. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మీ, విజయ్ దేవరకొండతో జరిపిన మాటామంతి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆహా తెలుగు ఓటీటీలో ప్రసారమవుతున్న లేటేస్ట్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ గురించి పూరి జగన్నాథ్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ..

  జాతీయ స్థాయిలో టాప్ రేటింగ్

  జాతీయ స్థాయిలో టాప్ రేటింగ్

  Unstoppable టాక్ షోతో నందమూరి బాలకృష్ణ ఊహించని విధంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. జాతీయ స్థాయిలో ప్రసారమయ్యే టాక్ షోల్లో టాప్ 5లో ఒకటిగా నిలిచారు. దీంతో బాలయ్య టాలెంట్‌లో మరో కోణం బయటపడింది. unstoppable షోలోకి వచ్చే సినీ సెలబ్రిటీలను తనదైన శైలిలో ఆకట్టుకొంటూ సినీ హీరోల అభిమానులనే కాకుండా సగటు టెలివిజన్ ప్రేక్షకుడిని ఆకట్టుకొంటున్నారు. దేశంలోనే అత్యంత టాప్ రేటింగ్ ఉన్న ది కపిల్ శర్మ షో రేటింగ్‌ను Unstoppable Show అధిగమించింది.

  పైసా వసూల్ షూటింగ్ సమయంలో

  పైసా వసూల్ షూటింగ్ సమయంలో

  లేటేస్ట్ Unstoppable ఎపిసోడ్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మాట్లాడుతూ.. పైసా వసూల్ సినిమా షూటింగ్ సమయంలో ఏదైనా చెప్పాలనుకొని.. నేను ఏమైనా అనుకొంటానని చెప్పలేకపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటూ బాలకృష్ణ అడిగితే.. అలాంటివేమీ లేవు. కానీ బాలకృష్ణ సినిమా అంటే కష్టం. బాలయ్యకు కోపం ఎక్కువ అని చెప్పేవాళ్లు. మొదటి రోజు షూటింగ్ చేసిన తర్వాత మీ మనస్తత్వం అర్ధమైంది. రెండో రోజు నుంచి నాలో ఉన్న అభిప్రాయాలన్నీ మారిపోయాయి అని పూరీ జగన్నాథ్ సమాధానం ఇచ్చారు.

  ఏ అమ్మాయిని కలిశావు అంటూ పూరీతో బాలకృష్ణ

  ఏ అమ్మాయిని కలిశావు అంటూ పూరీతో బాలకృష్ణ

  పూరీ జగన్నాథ్‌ను ఇబ్బందుల్లో పడేసేందుకు బాలకృష్ణ.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలని మీ సొంత ఊరు నుంచి ట్రైన్ ఎక్కినప్పుడు ఏ అమ్మాయిని చివరిసారిగా కలిశాడు అనే ప్రశ్న అడిగితే.. పూరీ చెప్పడానికి నిరాకరించాడు. అలాంటి విషయాలు లేవు అంటూ ఆ ప్రశ్నను దాటవేశాడు. తాను హీరో కావాలని ఇండస్ట్రీకి రాలేదు. మధు ఫిలిం ఇన్సిట్యూట్‌లో డైరెక్షన్ కోర్సులో తాను ఒక్కడినే ఉండేవాడిని. దాంతో యాక్టింగ్ ట్రైనింగ్‌లో నన్ను చేర్చారు. ఆరు నెలల తర్వాత ఆ కోర్సు నుంచి బయటకు వచ్చాను అని పూరీ తెలిపాడు.

  పోర్చుగల్‌లో నా గర్ల్‌ఫ్రెండ్ పేరేంటి?

  పోర్చుగల్‌లో నా గర్ల్‌ఫ్రెండ్ పేరేంటి?

  అయితే పైసా వసూల్ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో చేసేటప్పుడు నా గర్ల్‌ఫ్రెండ్ పేరు నీవు చెప్పగలవా? అంటూ ప్రశ్నించాడు. అయితే మీకు ఇబ్బంది ఏమీ లేకపోతే.. నేను చెప్పేస్తాను అని అంటే.. బాలకృష్ణ ప్రొసీడ్ అంటూ సైగ చేయడంతో పోర్చుగల్‌లో నీ గర్ల్‌ఫ్రెండ్ పేరు కరోలినా అంటూ పూరీ చెప్పాడు. ఆ తర్వాత వసుంధర కార్‌వాన్‌లోనే ఉంది.. లంచ్ టైమ్‌లో ఏమౌతుందో అంటూ బాలయ్య భయపడినట్టు నటించాడు.

  మద్యపానంపై బాలయ్య పద్యాలు

  పోర్చుగల్‌లో పైసా వసూల్ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ చేసిన హంగామా గురించి పూరీ జగన్నాథ్ వెల్లడిస్తూ... ప్రతీ రోజు మద్యపానంపై స్త్రోత్రాలు వల్లించేవారు. రాత్రి అయిందటే నాలుగు పెగ్గులు వేసి.. 2 గంటల వరకు షూటింగ్ చేసేవారు. పోర్చుగల్‌లో విపరీతమైన చలి ఉన్నప్పటికీ బాలకృష్ణ రాత్రంతా షూట్ చేశారు. రాత్రి అయితే చాలు మద్యంపై రకరకాల పద్యాలు పాడేవారు అని చెప్పారు.

  మామ.. ఏక్ పెగ్ లావ్ అంటూ

  మామ.. ఏక్ పెగ్ లావ్ అంటూ

  ఇక బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా ఎప్పుడని ఛార్మీ ప్రశ్నిస్తే.. బాలయ్య ఎప్పుడంటే అప్పుడే అంటూ పూరీ క్లారిటీ ఇచ్చారు. నేను కూడా రెడీ అంటూ బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా పేరు మామా.. ఏక్ పెగ్ లావో అనై టైటిల్ పెడుదాం అంటూ బాలకృష్ణ అన్నారు. దాంతో పూరీ, చార్మీ, విజయ్ దేవరకొండ నవ్వుల్లో మునిగిపోయారు. అలా సరదాగా, చలాకీగా Unstoppable షో సాగిపోయింది.

  English summary
  Tollywood director Puri Jagannadh, Vijay Deverakonda, Charmy Kaur are participated in Nandamuri Balakrishna's Unstoppable show. In this show, Puri Jagannadh leaks Nandamuri Balakrishna's Girl friend in Portugal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X