X
తెలుగు » సినిమాలు » ఓం నమో వెంకటేశాయ
ఓం నమో వెంకటేశాయ

ఓం నమో వెంకటేశాయ

Biography | 10 Feb 2017 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఓం నమో వెంకటేశాయ స్టోరీ

ఓం నమో వెంకటేశాయ సినిమా వెంకటేశ్వరస్వామికి అపర భక్తుడైన హథీరామ్ బాబా జీవిత చరిత్ర గురించి తీసిన భక్తిరస చిత్రం ఇందులో అక్కినేని నాగార్జున, విమలా రామన్, ప్రగ్యా జైస్వాల్, అనుష్క శెట్టి, బ్రహ్మానందం, సౌరభ్ రాజ్ జైన్, రావు రమేష్, వెన్నెల కిశోర్, రఘు బాబు, జగపతి బాబు  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత మహేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చరు.  కథ ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతుంది. 16 శతాబ్దానికి చెందిన రామ్ (నాగార్జున) చిన్నతనం నుంచీ దేవుడిని చూడాలనే కోరికతో జ్వలిస్తూంటాడు. దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ చిన్నతనంలోనే ఇంట్లోంచి బయిటకు వచ్చి...తిరుమలలోని గురువు పద్మానంద స్వామి (సాయికుమార్) నడుపుతున్న వేద పాఠశాలలో చేరుతాడు. అక్కడే విద్య అభ్యసిస్తూ..ఆయన చెప్పిన మాటతో తపస్సుకు సైతం పూనుకుంటాడు. రామ్ చేసే తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కానీ దేవుడ్ని అప్పుడు గుర్తించలేకపోతాడు. తర్వాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని మళ్ళీ దేవుని చెంతకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ అక్కడున్న కొంతమంది వలన దేవుడిని చేరుకోలేకపోతాడు. ఆ క్రమంలోనే మరో వెంకటేశ్వర సామి భక్తురాలు కృష్ణమ్మ (అనుష్క) ను కలుస్తాడు. ఆమెతో కలిసి తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుని, క్షేత్రాన్ని వైకుంఠంగా అభివృద్ధి చేస్తూంటాడు. అతని భక్తికి ముగ్దుడైన వెంకటేశ్వర స్వామి మరోసారి అతనికి దగ్గరై అత్యంత ఆప్తుడిగా మారిపోతాడు. తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు రమేష్‌) ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి విధులు నిర్వర్తించటం లేదని రామ ప్రశ్నిస్తాడు. దాంతో గోవిందరాజులు... రామపై ఎందుకు కక్ష కడతాడు. మరో ప్రక్క రామను పరీక్షించాలని స్వామి నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలో రామ జీవితంలో రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. రామ యొక్క భక్తి శ్రద్దలు చూసిన స్వామివారు...మొదట ఆయన కలలోనూ ఆ తర్వాత నిజ జీవితంలోనూ కనపడతారు. అంతేకాకుండా రామతో పాచికలు ఆడతారు. అలా రామా వద్ద స్వామి వారు పాచికల పందెంలో తన నగలు మొత్తం ఓడుతారు. అదే సమయంలో స్వామి వారి నగల దొంగతనం గుడిలో జరుగుతుంది. దేవాలయ అధికారులు దృష్టి, అనుమానం రామ వారిపై పడుతుంది. ఆ క్రమంలో రామా నివాసం ఉంటున్న ఆశ్రమం పై ఆ నగల కోసం దాడి చేస్తారు. అక్కడ ఆ ఆశ్రమంలో రామ వద్ద స్వామి వారి నగలు దొరుకుతాయి. దాంతో అప్పటి రాజు...రామాని ..ఖైదు చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ స్వామి భక్తుడు కథలో భవానీ (ప్రగ్యాజైస్వాల్‌) పాత్రేంటి? రామ కోసం ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? అసలు ...రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.
Read More

ఓం నమో వెంకటేశాయ కాస్ట్ & క్రూ

ఓం నమో వెంకటేశాయ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె రాఘవేంద్ర రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత మహేశ్వర రెడ్డి జి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఓం నమో వెంకటేశాయ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
భక్తికున్న శక్తితో వేంకటేశ్వరస్వామిని మురిపించిన మరో పరమ భక్తుడు హథీరాం బాబా కథ ఇది. అయితే కథ జనాలకి పెద్దగా తెలిసింది కాకపోవటం కలిసి వచ్చింది. దాంతో ఫ్రెష్ గా ఓ కొత్త సినిమా చూస్తున్న ఇంపార్ట్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టులా నిలిచింది. ముఖ్యంగా నాగార్జున ఫెరఫార్మెన్స్ ఆయన అభిమానులను మాత్రమే సినీ లవర్స్ చేత కూడా శభాష్ అనిపిస్తుంది.

ఓం నమో వెంకటేశాయ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఓం నమో వెంకటేశాయ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+