X
తెలుగు » సినిమాలు » పక్క కమర్షియల్
పక్క కమర్షియల్

పక్క కమర్షియల్

Action | Comedy | Romance | 01 Jul 2022 | U/A | 152 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

పక్క కమర్షియల్ స్టోరీ

పక్క కమర్షియల్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపి చంద్, రాశి ఖన్నా, సత్య రాజ్, రావు రమేష్, అజైగోష్, వైవా హర్ష, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి వహించారు. బన్ని వాసు, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి కలిసి నిర్మించారు. సంగీతం జాక్స్ బిజోయ్ అందించారు.  కథ  సూర్య నారాయణ(సత్య రాజ్) రాజ్ ఒక నిజాయితీ గల జడ్జి. అనుకోకుండా ఒక రోజు ఒక కేసులో తన తీర్పు వల్ల ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో తనకు ఈ న్యాయవృత్తి సరికాదని చెప్పి జడ్జి పదవికి రాజీనామా చేసి కిరాణా షాపు పెట్టుకుని కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. తాను చేసిన తప్పు తన కొడుకు లక్కీ(గోపీచంద్) ద్వారా సరిదిద్దుకోవాలని భావించి అతనిని లాయర్ చదివిస్తాడు. అన్యాయం జరిగిన వారి వైపు నిలబడి లాభాపేక్ష లేకుండా కేసులు వాదించమని చిన్నప్పటి నుంచి అతనికి నూరిపోస్తూ ఉంటాడు. అయితే ఆ కొడుకు తండ్రి ముందు అందరి దగ్గర న్యాయంగా ఉన్నట్లు నటిస్తూనే పక్కా కమర్షియల్ లాయర్ గా మారతాడు. దానికి తోడు ఎవరి వల్ల తన తండ్రి అయితే జడ్జి పదవికి రాజీనామా చేసి సామాన్య జీవితం గడుపుతున్నాడో అతనికోసమే కొన్ని తప్పుడు కేసులు వాదిస్తూ ఉండడంతో సూర్యనారాయణ మళ్లీ లాయర్ కోటు వేసుకునేందుకు సిద్ధమవుతాడు. అలా తండ్రి కొడుకుల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? మధ్య లాయర్ ఝాన్సీ రాణి(రాశి) పాత్ర ఏమిటి? ఈ యుద్ధంలో తండ్రి గెలిచాడా? లేక కొడుకు గెలిచాడా? నాన్ కమర్షియల్ తండ్రి కొడుకుని ఓడించడం కోసం ఏం చేశాడు? పక్కా కమర్షియల్ కొడుకు తండ్రిని ఓడించడం కోసం ఏం చేశాడనేది సినిమా.
Read More

పక్క కమర్షియల్ కాస్ట్ & క్రూ

పక్క కమర్షియల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మారుతి
స్టోరీ మారుతి
సినిమాటోగ్రఫీ కార్మ్ చావ్లా
సంపాదకుడు ఎస్ బి ఉద్ధవ్
సంగీతం జాక్స్ బిజోయ్
నిర్మాత బన్ని వాసు, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పక్క కమర్షియల్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
పక్కా కమర్షియల్ సినిమా ఒకపక్క రొటీన్ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం చాలా వరకు సఫలం అయింది అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా థియేటర్లకు వెళ్లి చూడగలిగే ఈ సినిమాకు యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పక్క కమర్షియల్ ట్రైలర్

Video Thumbnail

పక్క కమర్షియల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పక్క కమర్షియల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+