Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇస్మార్ట్ శంకర్: ఫ్లైట్ మొత్తం బుక్ చేసిన పూరి.. వారణాసిలో భారీ యాక్షన్ సీక్వెన్స్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మే 1 నుంచి ఆధ్యాత్మిక నగరం వారణాసిలో షూటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కీలకంగా ఉండే కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం వారణాసి వెళ్లేందుకు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ కోసం ఒక ఫ్లైట్ మొత్తాన్ని బుక్ చేశారట. ఫైట్ కొరియోగ్రాపర్ రియల్ సతీష్ మాస్టర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుగబోతున్నట్లు తెలుస్తోంది. పూరి సినిమాల స్టైల్లో పవర్‌ఫుల్‌గా ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని టాక్.
రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.