twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతీయ జెండాను ఎగురేసే సినిమాను బాయ్‌కాట్ చేస్తారా? ఏదైనా కొట్లాడుడే.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

    |

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై సంయుక్తంగా పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ నిర్మిస్తున్న చిత్రం లైగర్. ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా కోసం దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గత రెండువారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే విజయవాడలో నిర్వహించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

    ప్రాణం పెట్టి లైగర్ సినిమా తీశాం

    ప్రాణం పెట్టి లైగర్ సినిమా తీశాం


    మూడేళ్ల నుంచి లైగర్ చిత్రాన్ని తీస్తున్నాం. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. సినిమాను ప్రాణం పెట్టి తీశాం. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. పూరీ కథ చెప్పగానే మెంటల్ వచ్చేసింది. కథ విన్న వెంటనే మరో క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాను. సినిమా షూటింగులో ప్రతీ రోజు ఓ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్, సరికొత్త అనుభూతిని పొందాను అని విజయ్ దేవరకొండ అన్నారు.

     ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో

    ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో


    లైగర్ సినిమాను దర్శక, నిర్మాత కరణ్ జోహర్ దేశానికి పరిచయం చేశారు. మనం ధర్మాన్ని ఆచరిస్తున్నాం. ఎలాంటి పరిస్థితులెదురైనా, ఎదొచ్చిన కొట్లాడుడే. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధ్య తరగతి ప్రజలకు సహకరించాం. వాళ్లు నాపై, నా సినిమాలపై ప్రేమను కురిపించి, ఆదరించడం ద్వారా వచ్చిన డబ్బుతోనే ప్రజలకు సేవ చేశాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

     ఇండియా తలఎత్తుకొనే విధంగా

    ఇండియా తలఎత్తుకొనే విధంగా


    లైగర్ సినిమా మదర్ సెంటిమెంట్‌తో కూడిన చిత్రం. ఇండియాను తలఎత్తుకొనే సినిమాగా రూపొందించాం. భారతీయ జెండాను ప్రపంచ సినిమాలో ఎగురవేసే ప్రయత్నం చేశారు. అలాంటి సినిమాను బాయ్‌కాట్ చేస్తారా? మాకు వ్యతిరేకంగా ఏం చేస్తారో చూద్దాం. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాను ఆదరించండి అని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్నారు.

     కుర్రాడిని తల్లి ముంబైకి

    కుర్రాడిని తల్లి ముంబైకి


    లైగర్ చిత్రం యాక్షన్, డ్రామా, లవ్ అంశాలతో రూపొందిన చిత్రం. కరీంనగర్ నుంచి ఓ కుర్రాడిని తీసుకొని ఓ తల్లి ముంబైకి వెళ్తుంది. కొడుకులోని ప్రతిభను గుర్తించి అతడిని బాక్సర్‌ను చేస్తుంది. ఈ క్రమంలో బాక్సర్ ప్రేమలో పడుతాడు. ఇదే లైగర్ స్టోరి. ఇందులో మైక్ టైసన్ ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తారు అని పూరీ జగన్నాథ్ అన్నారు.

     అమ్మ, నాన్న, తమిళమ్మాయి కథ వేరే

    అమ్మ, నాన్న, తమిళమ్మాయి కథ వేరే

    లైగర్ సినిమాకు అమ్మా, నాన్న తమిళమ్మాయి సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. లైగర్, అమ్మ, నాన్న తమిళమ్మాయి వేర్వేరు స్టోరీలు. లైగర్ సినిమా స్పోర్ట్స్ డ్రామా కాదు. చిన్న పెద్ద అందరూ కలిసి చూడాల్సిన సినిమా.
    లైగర్ లాంటి సినిమాను థియేటర్లలోనే చూడాలి..ఓటీటీ‌లో మజా ఉండదు అని పూరీ జగన్నాథ్ అన్నారు.

    English summary
    Liger movie promotions are going nationwide. Vijay Deverakonda, Ananya Panday doing promotions. Here are the comments of Puri Jagannadh and Vijay Deverakonda on Liger Boycott.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X