For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పూరి జగన్నాథ్ సలహా ఇచ్చాడు.. చాలా మందికి తెలియదు: ఊల్లాల ఊల్లాల డైరెక్టర్

  |

  సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో వారి అబ్బాయి నటరాజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'ఊల్లాల ఊల్లాల'. సుఖీభవ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు దర్శకుడు సత్యప్రకాష్ మీడియాతో తెలిపారు.

  దర్శకుడు అవుదామనే వచ్చా కానీ..

  దర్శకుడు అవుదామనే వచ్చా కానీ..

  "నేను అసలు దర్శకుడు అవుదామనే పరిశ్రమకి వచ్చాను కానీ ఆ పైవాడి నిర్ణయంతో నటుడ్ని అయ్యాను. నటుడు అయిన ప్రతీవాడికి హీరో అవుదామని ఆలోచన, అభిరుచి, అభిలాష ఉంటుంది కానీ ఆ దేవుడి లెక్కలు వేరేలా ఉంటాయి. అందులో భాగంగానే ఏమో క్రూరుడైన విలన్ పాత్రలే అన్నిభాషల్లో దొరికాయి. కానీ చాలా మందికి నా పేరు సత్య ప్రకాష్ అని తెలీదు. భోజ్ పూరిలో తివారి బాబా అని, కర్ణాటకలో యాసిడ్ రాజా అని, కొత్వాల్ అని రకరకాల పేర్లతో పిలిచేవాళ్ల ప్రేమని పొందాను దానికి చాలా సంతోషంగా ఉంది" అన్నాడు సత్యప్రకాష్.

   కొంచం కష్టంగానే అనిపించింది

  కొంచం కష్టంగానే అనిపించింది

  ఈ సందర్బంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు సత్యప్రకాష్. మొదటిసారి దర్శకత్వం చేశారు కష్టంగా అనిపించిందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ''నిర్మాత ఇచ్చిన సమయంలో, ఇచ్చిన బడ్జెట్‌లో పని పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేయడం తెరవెనుక ఎన్నోసార్లు చూసినా, ఇప్పుడు నేనే మొదటిసారి చేయడం వల్ల కొంచం కష్టంగానే అనిపించింది. అలాగే తండ్రిగా, నటుడిగా నేను మా అబ్బాయి నటరాజ్‌కి హీరోగా అవ్వడానికి కావాల్సిన ఫైట్స్, డాన్స్, బాడీ బిల్డింగ్, జిమ్నాస్టిక్స్ వంటివి రెండేళ్లు శిక్షణ తీసుకునేలా చేసాను, మా అబ్బాయిని కన్నడలో రాక్ లైన్ వెంకటేష్ గారు పరిచయం చేశారు. అదే సమయంలో గురురాజ్ గారితో 'ఊల్లాల ఊల్లాల' తీద్దాం అనుకోవడం ఆయనకి మా అబ్బాయి నటనని చూపించడం ఆయన ఒప్పుకోవడం కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.

  అందుకే గెటప్ వేయించాం

  అందుకే గెటప్ వేయించాం

  నిర్మాత గురురాజ్ గారు ఈ చిత్రంలో పాత్ర చేయడానికి కారణం మీరేనా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ''ఆయనకి సినిమాల పైన ఉన్న ఇష్టంతో ఇదివరకు కూడా చాలా చిత్రాలు చేసారు కానీ ఈ చిత్రంలోని పాత్రకి ఆయన సరిగ్గా సరిపోతారు అనిపించి గెటప్ వేయించాం, అనుకున్న దానికంటే బాగా చేశారాయన'' అని సత్య ప్రకాష్ తెలిపాడు.

  తనే డబ్బింగ్ చెప్పాడు

  తనే డబ్బింగ్ చెప్పాడు

  మీరు ఈ చిత్రంలో ఏ పాత్ర చేయలేదా? అంటే నేను చేశాను, కానీ సినిమా కథాంశం చెప్పే చిన్న పాత్ర అది అన్నాడు. అలాగే మీ అబ్బాయి తెలుగు మాట్లాడుతారా? అని అడగగా.. ''చాలా బాగా మాట్లాడుతాడు. ఈ చిత్రంలో అతనే డబ్బింగ్ చెప్పాడు, ఇంతకముందు చేసిన కన్నడ సినిమాలో కూడా తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు'' అని చెప్పాడు సత్యప్రకాష్.

  ప్రమోషన్ ఖర్చుతో కలిపి బడ్జెట్

  ప్రమోషన్ ఖర్చుతో కలిపి బడ్జెట్

  చిత్రం అనుకున్న బడ్జెట్‌‌లో చేసారా? బడ్జెట్ ఎంత అయింది? అనే దానిపై స్పందిస్తూ.. నిర్మాత మాకు బడ్జెట్ చాలా సౌకర్యంగా ఉండేలా ఇచ్చారు. అనుకున్నట్టుగానే ప్రమోషన్ ఖర్చుతో కలిపి 4 కోట్ల లోపలే 34 రోజుల్లో హైదరాబాద్ లోపల మరియు చుట్టుపక్కల్లోనే చేసేశాం'' అన్నాడు. మీరు ఎక్కువ చిత్రాలు ఈ భాషలో చేశారు? అని అడిగితే.. కన్నడ, తరువాత తెలుగు ఆ తరువాత భోజపురి అలా చాలా భాషల్లో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న ముఖ్య విలన్‌గా చేసాను. ఈ మధ్య కొంచం తగ్గించినా, మళ్లీ మునుపటిలాగే ఎక్కువ చిత్రాలు చేస్తాను అన్నాడు సత్య ప్రకాష్.

  రవి రాజా పినిశెట్టి గారి దగ్గరికి వస్తే..

  రవి రాజా పినిశెట్టి గారి దగ్గరికి వస్తే..

  మీరు దర్శకుడు కావాలి అని వచ్చారు కానీ పరిశ్రమకి నటుడిగా ఎలా పరిచయమయ్యారు? అనే ప్రశ్నపై.. ''దర్శకుడు అవుదామనే నిర్మాత రవి రాజా పినిశెట్టి గారి దగ్గరికి వస్తే విలన్ పాత్ర చేయమని చెప్పారు. అలాగే మలయాళం దర్శకుడు ప్రియదర్శన్ కూడా మోహన్ లాల్ గారి అభిమన్యు చిత్రంలో పాత్ర ఇచ్చారు. ఆ తరువాత విజయ్ బాపినీడు గారి దగ్గర పని చేస్తుండగా చిరంజీవి గారితో బిగ్ బాస్ చిత్రంలో చేయమన్నారు. అప్పటి నా పరిస్థితులకి సంపాదన, పేరు ముఖ్యం అనిపించి అలా వరుసపెట్టి వచ్చిన ఒకే రకం పాత్రలే చేసాను. తెలుగువాడిని అయినా ఇప్పటికి చాలా మంది నన్ను కన్నడ వాడు అనుకుంటారు'' అన్నాడు సత్య ప్రకాష్.

  పూరి జగన్నాథ్ సలహా

  పూరి జగన్నాథ్ సలహా

  మీరు చాలా పెద్ద డైరెక్టర్స్‌తో వర్క్ చేసారు ఎవరైనా టిప్స్ ఇచ్చారా? అని అడగగా.. ''90ml డైరెక్టర్ శేఖర్ రెడ్డి, వై.వీ.ఎస్ చౌదరి, పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ చాలా సలహాలు చెప్పారు అవి నాకు చాలా సహాయపడ్డాయి. అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసినపుడు పూరి గారు, నువ్వు చాలా సక్సెసఫుల్ డైరెక్టర్ అవుతావు అని మెచ్చుకున్నారు. అలాగే మా ప్రొడ్యూసర్ గురురాజ్ గారు కేవలం నిర్మాత గానే కాక అన్ని విధాలుగా సహాయపడ్డారు. అయన రియల్ ఎస్టేట్‌లో బిజీగా ఉన్నా, బిజినెస్ పక్కనపెట్టి మరీ చాలా సపోర్టివ్‌గా ఉన్నారు'' అన్నాడు.

  English summary
  Ullala Ullala Director gave intresting answers for journalists questions. This movie releasing soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X