పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ అలా ఫిక్సయ్యారా? ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో కొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రిందటే కన్ఫర్మ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు పూరి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ తెలిసింది.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నాలుగో వారం నుండి మొదలు పెట్టనున్నారట. ఈ మేరకు మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటించనున్నాడని సమాచారం.

 Vijay Deverakonda- Puri Jagannadh movie Latest Update

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించబోయే హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరికీ క్రేజ్ ఉన్నా ప్రస్తుతం అవకాశాలు లేవు కాబట్టి దాన్ని పూరి క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.

పూరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. పూరి, చార్మి నిర్మాతలుగా శ్రీమతి లావణ్య సమర్పణలో ఈ మూవీ తెరకెక్కనుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X