twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గొప్ప మనసు చాటుకున్న యష్... వాళ్ళందరి అకౌంట్లలోకి 5000 డిపాజిట్ ...!

    |

    కరోనా సెకండ్‌ వేవ్‌ భారతదేశ వ్యాప్తంగా తన పంజాను విసురుతోంది. గతేడాది మించి కొత్త కేసులు నమోదవుతుండడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌ డౌన్ లోకి వెళ్ళిపోయాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోనే కాక మహారాష్ట్ర, కర్నాటకలలో సైతం కరోనా కేసులు, మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దుకాణాలు, షాపింగ్ మాల్స్ మరియు థియేటర్లు మూసివేయబడ్డాయి. ఇక సినిమా షూటింగులు కూడా నిలిచిపోయాయి. పరిశ్రమలో పనిచేసే చాలామంది రోజు కూలీలు సైతం షూటింగులు లేకుండా ఇంట్లో ఉన్నారు.

    ఇది వారికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కారణమైందని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రముఖ నటులు కూడా సహాయం చేస్తున్నారు. తెలుగు నటులకు గతంలో చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ పేరుతో సహాయం చేశారు. ఇప్పుడు అదే విధంగా కన్నడ స్టార్ హీరో యష్ సహాయం చేయడానికి సిద్ధం అయ్యారు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న యష్ సుమారు 3,000 మంది రోజువారీ కార్మికుల బ్యాంకు ఖాతాలకు రూ .5 వేలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. 'ఒక అదృశ్య వైరస్ మనిషి జీవితాన్ని మరింత దిగజార్చింది, ముఖ్యంగా గత ఏడాది కాలంగా నా సినిమా కుటుంబం నిస్సహాయతతో ఉన్నారని పేర్కొన్నారు.

    Yash donates Rs 5,000 each to Kannada Film Fraternity members

    ఇది ఒంటరిగా పోరాడే సమయం కాదు, కాబట్టి మా సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు కార్మికుల బ్యాంకు ఖాతాలకు ఒక్కొక్కటికి రూ .5 వేలు చెల్లించాలని నిర్ణయించుకున్నాను "అని యష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. "మా యూనియన్ అధ్యక్షుడు సారా ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించారన్న ఆయన నేను గోవింద్, ప్రధాన కార్యదర్శులు రవీంద్రనాథ్‌తో చర్చించానని అన్నారు. మా కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు కార్మికుల అధికారిక బ్యాంకు వివరాలు నమోదు చేసుకున్న వెంటనే వారికి డబ్బు వేస్తామని వెల్లడించారు. ఈ చిన్న సహాయం ఇప్పుడు అన్ని కష్టాలకు పరిష్కారం అని చెప్పలేను కానీ కొంతలో కొంత వారికి సహాయపడే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

    English summary
    Pan Indian star Yash decided to help his own film indsutry people. he released a statement that he will be donating Rs 5,000 each to the members of Karnataka Film Fraternity which has about 3000 members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X