»   » ‘పికె’ రికార్డ్ ఢమాల్: ఇండియా నెం.1 ఇపుడు ‘బాహుబలి-2’ (6 డేస్ కలెక్షన్)

‘పికె’ రికార్డ్ ఢమాల్: ఇండియా నెం.1 ఇపుడు ‘బాహుబలి-2’ (6 డేస్ కలెక్షన్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అందరూ ఊహించినట్లే 'బాహుబలి-2' మూవీ బాక్సాఫీసు వద్ద చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెం.1 స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు రూ. 743 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో నెం.1 స్థానంలో ఉన్న 'పి.కె' మూవీ బాహుబలి దెబ్బకు రెండో స్థానికి పడిపోయింది.

పికె రికార్డు బద్దలవుతుందని అంతా ముందే ఊహించారు. అయితే కేవలం 6 రోజుల్లో బాహుబలి-2 రూ. 785 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ రికార్డుతో బాహుబలి-2 మూవీ బాక్సాఫీసు వద్ద నెం.1గా అవతరించింది.


ఎక్కడ ఎంత?

ఎర్లీ ఎస్టిమేషన్ ప్రకారం ఇండియాలో రూ. 630 కోట్ల గ్రాస్ (రూ. 495 కోట్ల నెట్), ఓవర్సీస్‌లో రూ. 155 కోట్ల గ్రాస్..... ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 785 కోట్లు వసూలు చేసిందని ప్రముక ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తెలిపారు.


750 కోట్లు క్రాసైంది

మరో ప్రముఖ విశ్లేషకుడు శ్రీధర్ పిల్లై కూడా బాహుబలి-2 మూవీ 6 రోజుల్లో రూ. 750 కోట్ల మార్కును క్రాస్ చేసిందని ట్వీట్ చేసారు.


సెకండ్ వీకెండ్ లో రూ. 1000 కోట్లు

సెకండ్ వీకెండ్ లో రూ. 1000 కోట్లు

ఇప్పటికే రూ. 800 కోట్లకు చేరువైన ‘బాహుబలి-2' మూవీ సెకండ్ వీకెండ్‌తో రూ. 1000 కోట్ల మార్కును అందుకుని సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతోందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.


ఫుల్‌రన్‌లో రూ. 1500 కోట్లు

ఫుల్‌రన్‌లో రూ. 1500 కోట్లు

ఫుల్ రన్‌లో ‘బాహుబలి-2' మూవీ రూ. 1500 కోట్లు వసూలు చేయడం ఖాయమని.....అదే జరిగితే ఆ రికార్డును అందుకోవడం మరో ఐదారేళ్ల వరకు అసాధ్యమే అని అంటున్నారు.


బాహుబలి-2లో ఐదు తప్పులు..... ఎత్తి చూపిన తమిళ దర్శకుడు!

బాహుబలి-2లో ఐదు తప్పులు..... ఎత్తి చూపిన తమిళ దర్శకుడు!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి-2 మూవీ ఇటీవల విడుదలై మెగాబ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఐదు తప్పులు ఎత్తి చూపారు తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


బాహుబలి-2: ప్రభాస్ కులం గురించి ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్

బాహుబలి-2: ప్రభాస్ కులం గురించి ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్

ప్రభాస్ కులాన్ని ప్రస్తావిస్తూ బాహుబలి-2 మూవీ విషయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Baahubali : The Conclusion (dubbed into Hindi, Tamil) has been crowned as the Highest Grossing Indian film in just six days. The SS Rajamouli's directorial, which released on April 28 world-wide, has earned gross of Rs 792 Cr (close to Rs 800 Crore) in 6 days and beaten the full-run world-wide record of Aamir Khan's PK (2014) which had earned gross of Rs 743 Crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu