»   » సినీ దర్శకుడుగా మహేష్ బాబు‌?

సినీ దర్శకుడుగా మహేష్ బాబు‌?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు త్వరలో దర్శకుడుగా యాక్షన్,కట్ చెప్పబోతున్నాడని తెలుస్తోంది.అయితే అది కేవలం సినిమాలో నటనవరకే నని తెలుస్తోంది.ప్రస్తుతం శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దూకుడు'లో ఈ పాత్ర ఉంటుందని చెప్తున్నారు.అలాగే పోలీస్‌ అధికారిగా, దొంగగా కూడా మహేష్ కనిపించి కామిడి చేయబోతున్నాడని చెప్తున్నారు.అంతేగాక చిత్రంలో పలు రాజకీయ అంశాలను కూడా జోడిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం విజయంపై నిర్మాత అనిల్ సుంకర చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఆయన ఈ చిత్రం గురించి చెబుతూ..అలాగే శ్రీను వైట్ల టైమింగ్, మహేష్ టైమింగ్ కలిస్తే 'దూకుడు". టైటిల్‌కి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. ఇందులో మహేష్ నట విశ్వరూపాన్ని చూస్తారు.ఏదిఏమైనా అద్భుతం అనిపించేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు శ్రీనువైట్ల. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోను సూద్‌, సాయాజీ షిండే, నాజర్‌, తనికెళ్ల భరణి, చంద్రమోహన్‌, మాస్టర్‌ భరత్‌, సురేఖావాణి, సుధ, వినయప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, రచన: గోపి మోహన్‌, కోన వెంకట్‌, సమర్పణ: జి.రమేష్‌బాబు.

English summary
Producers and distributors are planning to cash the craze of Prince with in the first week. The record high number of theatres in which Badrinath was released might now be washed away by Mahesh Babu Dookudu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu