X
తెలుగు » సినిమాలు » బ్రూస్ లీ
బ్రూస్ లీ

బ్రూస్ లీ

Action | Romance | 16 Oct 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

బ్రూస్ లీ స్టోరీ

బ్రూస్ లీ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ్, రాకుల్ ప్రీత్ సింగ్, కృతి ఖర్బంద, చిరంజీవి, అమితేష్, నధియ, అరుణ్ విజయ్, సంపత్ రాజ్, రావు రమేష్, పవిత్ర లోకేష్, తనికెళ్ళ భరణి, ముకేష్ రుషి, అలీ,  బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ ఎస్ స్వరాలు సమకుర్చారు. కథ అందరూ లక్ష్యం వైపే పరుగెడతారు...కొందరు మాత్రమే తన వాళ్ల కోసం నిలబడతారు..అటువంటి వారిలో ఒకడు బ్రూస్ లీ (రామ్ చరణ్). అక్క (కీర్తి కర్బంద) అంటే ప్రాణంగా పెరిగిన బ్రూస్ లీ... చిన్నప్పటి నుంచీ ఆమె కోసం తన చదువును,కెరీర్ ని సైతం త్యాగం చేస్తాడు. ఆమె కలెక్టర్ కావాలని తన తండ్రికి ఇష్టం లేకపోయినా చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టి స్టంట్ మ్యాన్ గా లైఫ్ ప్రారంభిస్తాడు. అంతేకాకుండా తప్పుడు కేసు పెట్టి తన అక్క కలెక్టర్ అవ్వాలనే లక్ష్యంకు అడ్డుపడబోయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్)కు బుద్ది చెప్తాడు. ఇలా అక్క...తను అన్నట్లు నడుస్తూండగా.. ఓ ట్విస్ట్. తన తండ్రి (రావు రమేష్) పని చేసే సంస్ధ యజమాని జయరాజ్(సంపత్ రాజ్), నదియాల కుమారుడుతో వివాహం నిశ్చియం అవుతుంది. అయితే జయరాజ్ పైకి కనిపించినంత మంచి వాడు కాదు. అతనికో దుర్మార్గమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది దాచి పెద్దమనిషిలా చెలామణి అవుతూంటాడు. అది తెలిసిన హీరో...ఆ విషయాన్ని ఎలా బయిటపెట్టి, విలన్ కు ఎలా బుద్ది చెప్పాడు. కథలో రియా (రకుల్) పాత్ర ఏమిటి... చిరు ఎంట్రీ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

బ్రూస్ లీ కాస్ట్ & క్రూ

బ్రూస్ లీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీను వైట్ల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత డి వి వి దానయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్రూస్ లీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మొదటినుంచీ శ్రీను వైట్ల సినిమాలంటే యాక్షన్ కామెడీలకు, కాస్తంత ఫ్యామిలీ ఎమోషన్స్ తిరగమోత పెట్టి వడ్డిస్తాడని తెలిసిందే. దాంతో కామెడీ పండితే అది 'దూకుడు' లేకపోతే 'ఆగాడు' అవుతోంది. అలాగే తను మొదలు పెట్టిన ఫార్మెట్ ని మార్చకుండా హీరోలను మాత్రమే మారుస్తూ వస్తున్నారు. అదే స్కీమ్ లో ఇప్పుడు రామ్ చరణ్ తో విలన్ ఇంట్లో హీరో చేరి అతన్ని ఇబ్బంది పెట్టి, ఆట కట్టించే కథనే కొంచెం అటూ చేసి తీసాడు. బ్రహ్మానందంని ఎప్పటిలాగే సెకండాఫ్ కు తెచ్చాడు. అలీ తో అమీర్ ఖాన్ ..పీకే స్పూఫ్ చేసారు. జయప్రకాష్ రెడ్డి చేత డ్యూయిల్ రోల్ వేయించి కామెడీ చేయించారు. ఇలా ఎన్ని కలిపినా ఎన్ని చేసినా సెకండాఫ్ సోసోగానే సాగి,డ్రాప్ అవుతూ వచ్చింది. అనుకున్న స్ధాయిలో బ్రహ్మీ కామెడీ పేలి ఈ సారి శ్రీను వైట్లను కాపాడలేదు. రామ్ చరణ్ క్యారక్టర్ కు సినిమాలో సరైన సమస్య ఇచ్చే నెగిటివ్ పాత్ర లేకపోవటంతో నీరసపడిపోయింది. అయితే రామ్ చరణ్ మాత్రం నటుడుగా, స్టైల్స్ లోనూ, డైలాగు డెలవరీలోనూ అదరకొట్టారు అని చెప్పటం లో సందేహం లేదు. ముఖ్యంగా డాన్స్ లకు అతను వేసే స్టెప్స్ చాలా బాగున్నాయి. అలాగే సినిమా చివర లో సినిమాని సేవ్ చేయటానికా అన్నట్లు చిరంజీవి ఎంట్రీ...ఆయన చెప్పే...జస్ట్ టైం గ్యాప్ మాత్రమే..టైమింగ్ లో మాత్రం కాదు అనే డైలాగు హైలెట్.

బ్రూస్ లీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బ్రూస్ లీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+