X
డాన్

డాన్

Action | Romance | 20 Dec 2007 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

డాన్ స్టోరీ

డాన్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, అనుష్క, రాఘవ లారెన్స్, నిఖిత, కెల్లీ దోర్జ్, చలపతిరావు, జీవా, కోట శ్రీనివాస రావు, రఘునాథరెడ్డి, వైజాగ్ ప్రసాద్, నరసింహ్మా రాజు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, కొరియోగ్రఫీ, దర్శకత్వం: రాఘవ లారెన్స్ నిర్వహించారు మరియు నిర్మాత: ఎమ్ఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. కథ చిన్నప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతూ పేదల పక్షాల నిలిచే తత్వం సూరి(నాగార్జున)ది. అందుకే గూండాల చేతిలో అన్యాయానికి గురయ్యే అనాధ బాలల తరఫున డాన్ గా నిలబడతాడు. ఆ అనాధలలో ఒకరైన రాఘవ(లారెన్స్) డాన్ కు దగ్గరవుతాడు. డాన్ ను అన్నా అని పిలిచే స్థాయికి చేరతాడు. ఎపుడైతే తమకు సమస్య ఎదురవుతుందో అపుడు అనాధలు, పేదలు డాన్ ను సంప్రదిస్తారు. ఇదిలా ఉంటే రాఘవ డానన్నకు పెళ్లి చేయడం కోసం ఒక అమ్మాయిని చూస్తాడు. ఇదిలా ఉంటే తన రైట్ హ్యాండ్ నిలుస్తూ వస్తున్న మూర్తి(చలపతిరావు) కుమార్తె ప్రియ(అనుష్క) డాన్ మనసును గెలుచుకుంటుంది. మరోవైపు రాఘవ కూడా నందిని(నిఖిత) ప్రేమలో పడతాడు. ఇక్కడ వ్యవహారాలు ఇలా ఉంటే అంతర్జాతీయ డాన్ స్టిఫెన్(కెల్లీ డార్జ్) ఆంధ్రప్రదేశ్ ను కూడా తన హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. దీనికి సూరి పెద్ద అడ్డంకిగా స్టిఫెన్ భావిస్తాడు. ముందుగా సూరిను మచ్చిక చేసుకోవడానికి స్టిఫెన్ ప్రయత్నిస్తాడు. సూరి లైట్ గా తీసుకుంటాడు. అంతేకాదు స్టిఫెన్ పంపిన వ్యక్తులలో ఇద్దరిని చంపివేస్తాడు. దీనికి ఆగ్రహించిన స్టిఫెన్, రత్నం(కోట శ్రీనివాసరావు) సాయంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తాడు. బాంబులు పేలుళ్ల వందలమంది చావుకు కారకుడవుతాడు. దీనికి మరింత ఆగ్రహానికి గురైన సూరి, స్టిఫెన్ మనుషలపై పట్టు సాధించడానికి ప్రయత్నించి సఫలమవుతాడు. తను ప్రేమలో పడ్డ నందిత స్టిఫెన్ మనిషని రాఘవ గ్రహిస్తాడు. రాఘవకు స్టిఫెన్ నుంచి ప్రమాదం ఉండవచ్చని భావిస్తున్న తరుణంలోనే రాఘవ, స్టిఫెన్ చేతిలో చంపివేయబడతాడు. ఆ తరువాత ఏమైందన్నది తెర మీద చూడాల్సిందే.
Read More

డాన్ కాస్ట్ & క్రూ

డాన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం లారెన్స్ రాఘవేంద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం లారెన్స్ రాఘవేంద్ర
నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డాన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమా కథ అంతా స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉండడంతో అందుకు తగ్గట్టుగా నాగార్జున మరో మారు తన సత్తాను ప్రదర్శించాడు. అనుష్క గ్లామర్ కూడా బాగా పనిచేసింది. నాగార్జున ప్రతిభ, అనుష్క గ్లామర్ ఈ రెండు అంశాలే సినిమాను కాపాడాల్సినవి. కామెడీ ట్రాక్ బొత్తిగా లోపించింది. లారెన్స్ నే కామెడీ చేయడానికి ప్రయత్నించాడు. నిఖిత రోల్ ఇందులో ఊహించని విధంగా ప్రత్యక్షమవుతుంది. ఎస్ గోపాల్ రెడ్డి పని ఎప్పటిమాదిరిగానే రాణించింది.

డాన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

డాన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+