X
తెలుగు » సినిమాలు » ఈడు గోల్ద్ ఎహే
ఈడు గోల్ద్ ఎహే

ఈడు గోల్ద్ ఎహే

Comedy | Romance | 07 Oct 2016 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఈడు గోల్ద్ ఎహే స్టోరీ

ఈడు గోల్ద్ ఎహే సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, సుష్మా రాజ్, రిచా పనయ్, పునీత్ ఇస్సర్, నరేష్, ప్రిద్వి, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి, ప్రబాస్ శ్రీను, జయసుధ, శకలక శంకర్, చరణ్ దీప్, మాస్టర్ భరత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరు పొట్ల నిర్వహించారు మరియు నిర్మాత సుంకర రామబ్రహ్మం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాగర్ మహతి స్వరాలు సమకుర్చరు.    కథ   బంగార్రాజు (సునీల్) ఓ అనాథ. చాలా అమాయకుడు. అతడు ఎక్కడ పనిచేస్తే అక్కడ యజమానికి కష్టాలు. దీంతో అతన్ని పనిలో పెట్టుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన బంగార్రాజును జయసుధ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. బంగార్రాజును ఆమె తన పెద్ద కొడుకుగా చేరదీస్తుంది. ఆ కుటుంబంతోనే ఉంటూ వారి వ్యాపారం చూసుకుంటుంటాడు. ఇదిలా సాగుతుండగా తనతో పరిచయం లేని కొందరు వ్యక్తులు తనను సునీల్ వర్మగా అంటూ పలుకరించడం బంగార్రాజును ఆశ్చర్యపరుస్తుంది. మరో వైపు బంగారు విగ్ర‌హాల అక్ర‌మ వ్యాపారం చేసే మ‌హ‌దేవ ఇంట్లో దొంగ‌త‌నం జరుగుతుంది. అది సునీల్ వ‌ర్మ పనే అని తెలుసుకున్న మ‌హ‌దేవ అచ్చు అత‌నిలా ఉండే బంగార్రాజుపై ప‌గ పెంచుకుంటాడు. బంగార్రాజును సునీల్ వర్మలా భావిస్తూ అందరూ వెంటపడుతుంటారు. అతడు దొరక్క పోవడంతో బంగార్రాజు తమ్ముడిని కిడ్నాప్ చేస్తాడు. మహదేవ్ వద్దకు వెళ్లి తాను సునీల్ వర్మను కాదని, బంగార్రాజును అని తన తమ్ముడిని వదిలెయ్యమని కోరుతాడు. సునీల్ వర్మ వస్తేనే తమ్ముడిని వదిలేస్తానని, లేకుంటే చంపేస్తానని చెప్పడంతో....సునీల్ వర్మను వెతుక్కుంటూ బంగార్రాజు ప్రయాణం మొదలవుతుంది. మరి సునీల్ వర్మ ఎవరు? బంగార్రాజుకు అతడికి సంబంధం ఏమిటి? చివరకు కథ ఎలా ముగిసింది అనేది తెరపై చూడాల్సిందే. 
Read More

ఈడు గోల్ద్ ఎహే కాస్ట్ & క్రూ

ఈడు గోల్ద్ ఎహే సిబ్బంది సమాచారం

దర్శకత్వం వీరూ పోట్ల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాగర్ మహాతి
నిర్మాత సుంకర రామబ్రహ్మం
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఈడు గోల్ద్ ఎహే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హీరో సునీల్ సినిమాలన్నా... వీరు పోట్ల సినిమాలన్నా ప్రేక్షకలు కామెడీ ఆశిస్తారు. ఈ సినిమాలో అది బాగానే వర్కౌట్ అయింది. ట్విస్టులు, సస్పెన్స్ కు కామెడీ జోడవ్వడం ప్రాస‌ల‌తో పేల్చే డైలాగులు ప్రేక్షకులను న‌వ్విస్తాయి. నిమా ఫస్టాఫ్ అంతా కామెడీతో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కూడా అదే కంటిన్యూ చేసే ప్రయత్నం చేసాడు కానీ పూర్తి స్థాయిలో వర్కౌట్ అయినట్లు అనిపించదు. క్లైమాక్స్ రోటీన్ గా ఉంది. సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ సునీల్. సినిమాలో కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. అయితే కథలో కొత్తదనం లేక పోవడం, క్లైమాక్స్ గొప్పగా ఏమీ లేక పోవడం మైనస్. ఓవరాల్ గా....ఈ మధ్య కాలంలో వచ్చిన సునీల్ సినిమాలతో పోలిస్తే ‘ఈడు గోల్డ్ ఎహె' ఫర్వాలేదు. సరదాగా నవ్వుకోవచ్చు.

ఈడు గోల్ద్ ఎహే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఈడు గోల్ద్ ఎహే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+