X
తెలుగు » సినిమాలు » మీలో ఎవరు కోటీశ్వరుడు
మీలో ఎవరు కోటీశ్వరుడు

మీలో ఎవరు కోటీశ్వరుడు

Comedy | Romance | 16 Dec 2016 | U/A | 106 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మీలో ఎవరు కోటీశ్వరుడు స్టోరీ

మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ సత్తిబాబు నిర్వహించారు మరియు నిర్మాత కె కె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీవసంత్ స్వరాలు సమకుర్చరు. కథ రైతు (చ‌ల‌ప‌తిరావు) కొడుకు ప్ర‌శాంత్ (న‌వీన్ చంద్ర‌). బిజినెస్ ఐకాన్ ఏబీఆర్ (ముర‌ళీ శ‌ర్మ‌) కుమార్తె ప్రియ (శ్రుతిసోది). ప్రశాంత్(నవీన్ చంద్ర) ఓ సిన్సియర్ స్టూడెంట్. కాలేజ్ టాపర్ అయిన ఈ కుర్రాడికి ఓ రోజు అర్థరాత్రి ఫుల్గా తాగేసి.. కారును డివైడర్కు గుద్దేసిన ప్రియా(శృతిసోథీ) కనిపిస్తుంది. ప్రియా పరిస్థితిని చూసి తానే వెళ్లి ఇంట్లో దిగబెట్టి వస్తాడు ప్రశాంత్. ఓ అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో కనిపించినా.. ఏ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చిన ప్రశాంత్తో ప్రేమలో పడుతుంది ప్రియా అంత‌స్తుల తేడాను అర్థం చేసుకున్న ప్ర‌శాంత్ ఆమెకు దూరంగా ఉండాల‌నుకుంటాడు. అయితే ఆమె అభ్య‌ర్ధ‌న మేర‌కు త‌మ ప‌ల్లెటూరికి తీసుకెళ్తాడు. కోటీశ్వ‌రుల కూతురు త‌మ ఇంట్లో అంద‌రితో క‌లివిడిగా ఉండ‌టం చూసి మ‌న‌సుప‌డ‌తాడు. వీరి ప్రేమ‌ను ఏబీఆర్ అంగీక‌రించ‌డు. తన ఆస్తి కోసమే ప్రియను ప్రేమలో పడేశావని ప్రశాంత్ని అవమానిస్తాడు.అప్పుడు ప్ర‌శాంత్ ఓ చిక్కుముడి వేస్తాడు. డబ్బుతో ఆనందం రాదని, కావాలంటే మీరు ఒక్కసారి ఏదైన బిజినెస్ చేసి నష్టపోయి చూడండి తరువాత మీకు ఆనందం విలువ ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పటి వరకు ఏ బిజినెస్లోనూ నష్టపోని ఏబీఆర్, నష్టాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా ఇవ్వమని పేపర్ ప్రకటన ఇస్తాడు. అలాంటి ఐడియా ఇచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి ప్రకటిస్తాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణమురళి) ఆ ప్రకటన చూసి ఏబీఆర్ను కలుస్తాడు. తాను ఓ ఫ్లాప్ సినిమా తీసి పెడతానని దాంతో భారీగా నష్టం వస్తుందని ప్రామిస్ చేస్తాడు. దానికి స‌మాధానం వెతుక్కునే ప్ర‌య‌త్నంలోనే థ‌ర్టీఇయ‌ర్స్ పృథ్విని పెట్టి `త‌మ‌ల‌పాకు` అనే సినిమాను చేస్తాడు ఏబీఆర్‌. ఆ సినిమాలో మ‌హేశ్ (పృథ్వి), స‌మంత (స‌లోని) అనే పాత్ర‌లు అంద‌రికీ న‌చ్చుతాయి. ఆ సినిమాను తీసిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణ‌ముర‌ళి)కు, ద‌ర్శ‌కుడు రోల్డ్ గోల్డ్ ర‌మేశ్ (ర‌ఘుబాబు)కు మంచి పేరు వ‌స్తుంది. ఇంత త‌తంగం త‌ర్వాత ఏబీఆర్ త‌న కూతురు ప్రేమ విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకుంటాడు. అదేమిటన్న‌ది క్లైమాక్స్.
Read More

మీలో ఎవరు కోటీశ్వరుడు కాస్ట్ & క్రూ

మీలో ఎవరు కోటీశ్వరుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఇ సత్తిబాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీ వసంత్
నిర్మాత కెకె రాధామోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మీలో ఎవరు కోటీశ్వరుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా కొన్నిచోట్ల సాగ‌దీసిన‌ట్టు ఉంది అయితే కేవల కామెడీ ప్రధానం గా, ఎంటర్టైన్ మెంట్ కోసం మాత్రమే చూడాలి తప్ప స‌ర‌దాగా సాగిపోయే ఈ చిత్రంలో లాజిక్కులు వెతకటం వృధా ప్రయాస. ఇంత‌కు ముందు ప‌లు తెలుగు చిత్రాల్లో చూసిన పాత ఫార్ములాతో కాస్త కామెడీ, కొన్ని స్పూఫ్ లతో అల్లుకున్న క‌థే ఇది. సంతోషానికి, ఆనందానికి తేడా తెలుసుకోవ‌డానికి ఓ వ్యాపార‌వేత్త ప‌దికోట్లు న‌ష్ట‌పోవ‌డానికి సిద్ధ‌మ‌వ‌డ‌మ‌నే కాన్సెప్ట్ అంత తేలిగ్గా మింగుడుప‌డ‌దు. తెలుసా... అనే పాట త‌ప్ప మిగిలిన పాట‌లు కానీ, ట్యూన్లు కానీ పాడుకునేలా అనిపించ‌వు. పాట‌ల‌న్నీ సినిమాలో రావాలి కాబ‌ట్టి వ‌చ్చిన‌ట్టు అనిపిస్తాయి. కాలేజీ స‌న్నివేశాలు కొన్ని, హీరోని ప్రేమ‌లోకి దించ‌డానికి హీరోయిన్ చేసే ప్ర‌య‌త్నాలు కొన్ని ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. పంచ్ డైలాగులు విన‌డానికి బాగానే ఉన్నా కొన్ని చోట్ల ఆయా సీన్‌లు అంత భారాన్ని మోయ‌లేక‌పోయాయ‌న్న‌ది వాస్త‌వం. స్క్రీన్ ప్లే మాత్రం పెద్ద మైనస్ అనిప్స్తుంది. పేరుకు నవీన్ చంద్ర హీరో అయినా.. సినిమా అంతా పృథ్వీనే హీరోగా కనిపిస్తాడు. తనకు బాగా అలవాటైన పేరడీ సీన్స్తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్తో పాటు పంచ్ డైలాగ్స్తోనూ అలరించాడు. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు పాత్రకు పోసాని కృష్ణమురళి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రఘుబాబు, పోసాని కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కితకితలు పెడతాయి. ఈ చిత్రంలో ఆనందానికి, సంతోషానికి తేడాను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే కామానికి, శృంగారానికి, ప్రేమ‌కు తేడా ఉంటుంద‌నే విష‌యాన్ని కాసింత గ‌మ‌నించి ఉంటే బావుండేది. ఇటువంటి ఒక‌టీరెండు స‌న్నివేశాల వ‌ల్ల ప్రేమ అనే ప‌దానికి త‌ప్పుడు అర్థం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది గ్ర‌హించి ఉండాల్సింది. ఇక మొత్తానికి ఒక మాటగా చెప్పాలీ అనుకుంటే కామెడీ అనే దృష్తిలో మాత్రమే చూడాలనుకున్న వారికి పూర్తి సంతృప్తినిచ్చే సినిమా ఇది.

మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మీలో ఎవరు కోటీశ్వరుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+