X
తెలుగు » సినిమాలు » నమో వెంకటేశ
నమో వెంకటేశ

నమో వెంకటేశ

Comedy | Romance | 14 Jan 2010 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

నమో వెంకటేశ స్టోరీ

నమో వెంకటేశ  సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్‌, త్రిష , బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ, శ్రీనివాస రెడ్డి, తెలంగాణ శకుంతల, ఎమ్ ఎస్ నారాయణ, రఘు బాబు, బెనర్జీ, ముకేష్ ఋషి, దర్మవరపు సుబ్రమాణ్యం, ప్రగత్య, సురేఖ వాణి, సుధ, శివా రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ ఏజ్ బారైన పర్వతనేని వెంకటరమణ (వెంకటేష్‌) కొంచెం అమాయికత్వం,మరికొంత మంచితనం ఉన్న వ్యక్తి. అతను వెంట్రిక్వాలిజం చేసి బ్రతుకు నెడుతూంటాడు. అలాగే అతని ఏకైక జీవితాశయం తన డ్రీమ్ గర్ల్ ని కలుసుకోవటం. అయితే ఆ అవకాశం వెంకీ కి ప్యారిస్ ట్రిప్ లో వచ్చింది. అక్కడి తెలుగు వారి ఆహ్వానంతో ప్రదర్శనలు ఇవ్వటానికి వెళితే అక్కడ త్రిష పరిచయమైంది. ఆమె ఆ పోగ్రాం ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్(బ్రహ్మానందం) మేనకోడలు. వెంటెనే ఆమెతో ప్రేమలో పడి ప్రొసీడైపోదామని డిసైడ్ అవుతాడు. అయితే ప్రసాద్ సామాన్యుడు కాదు. అతనకి (హిందీ భేజా ఫ్రై సినిమాలోలాగ) కళాకారులును ఏడ్పించి ఆనందించే శాడిజం ఉంది. దాంతో తన మేనకోడలుతో లవ్ లో పడ్డ వెంకీని ఒక ఆట ఆడించాలనకుంటాడు. దాంతో త్రిషను కూడా కలుపుకుని ఆమె నిన్ను ప్రేమిస్తోందని చెప్పి వెంకీని తిప్పలు పెడుతూంటాడు. ఈలోగా త్రిష తాతయ్య (జయ ప్రకాష్ రెడ్డి) కు సీరియస్ గా ఉందని ఇండియాకు రమ్మని ఫోన్ వస్తుంది. రెగ్యులర్ గానే ఆమె అక్కడకు వెళ్ళగానే రెడీగా ఉన్న (విలన్) సుబ్బరాజుతో మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. ఆ ఫ్యాక్షన్ ఏరియానుంచి పారిపోవాలని త్రిష ట్రై చేసినా కుదరదు. అప్పుడు మళ్ళీ వెర్రిబాగుల వెంకినే అడ్డం పెట్టుకుని ఆ ప్రమాదం నుంచి బయిటపడాలని ప్లాన్ చేస్తారు. దాంతో వెంకీ ఆమె ఇంటికి వచ్చి మకాం వేసి తన ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అంతా సవ్యంగా జరుగుతుందనగా వెంకికి మరో ఊహించని నిజం తెలుస్తుంది. అప్పుడు వెంకీ ఏం చేస్తాడు..ఏమిటా ట్విస్టు లాంటి నిజం అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

నమో వెంకటేశ కాస్ట్ & క్రూ

నమో వెంకటేశ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీను వైట్ల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత అచంట గోపినాథ్, అచంట రాము, అనిల్ సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నమో వెంకటేశ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
షి ఈజ్ హాట్..హీ ఈజ్ కూల్..మధ్యలో ఫూల్ అని నమో వెంకటేశ పోస్టర్స్ పై పెద్దగా వేసి పబ్లిసిటీ చేసారు. ఆ వాక్యంలో హాట్ ..కూల్ అంటే హీరో, హీరోయిన్స్ అని అందరికీ అర్దమైంది. అయితే మధ్యలో ఫూల్ ఎవరనేది మాత్రం సినిమా చూస్తే స్పష్టంగా అర్ధమైంది. పోస్టర్స్, కాంబినేషన్(శ్రీనువైట్ల, వెంకటేష్, త్రిష) చూసి ఏదేదో ఊహించుకుని పరెగెత్తుకుని ధియోటర్ కి వచ్చిన ప్రేక్షకుడే ఆ ఫూల్. కామిడీలో ఇప్పటికే పండిపోయిన వెంకటేష్,శ్రీను వైట్ల తొలి కాంబినేషన్ అంటే ఏదో అధ్దిరిపోయే కామిడీ వస్తుందని వెళ్తే అక్కడ వ్వె..వ్వె..మీకంత సీన్ లేదు..అని వెక్కిరించినట్లయింది. ఏదో క్రేజీ కాంబినేషన్ కుదిరింది కదా అని అర్జెంటుగా రీళ్ళు చుట్టేసాం...అలవాటులో పొరపాటుగా అక్కడక్కడా కామిడీ పడింది..అది మీ అదృష్టం అని దర్శకుడు క్లారిటీగా చెప్పినట్లుంది.

నమో వెంకటేశ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నమో వెంకటేశ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+