X
తెలుగు » సినిమాలు » సప్తగిరి ఎక్సెప్రెస్
సప్తగిరి ఎక్సెప్రెస్

సప్తగిరి ఎక్సెప్రెస్

Comedy | Romance | 23 Dec 2016 | U/A |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

సప్తగిరి ఎక్సెప్రెస్ స్టోరీ

సప్తగిరి ఎక్సెప్రెస్ సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సప్తగిరి, రోషిని ప్రకాష్, అలీ, పోసాని కృష్ణ మురళి, సయాజి షిండే, తులసి శివమణి, హేమ, శకలక శంకర్, అజయ్‌ ఘోష్‌, రాఘవ ఉదయ్ , జాన్సి, మధు నందన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అరుణ్ పవర్ నిర్వహించారు మరియు నిర్మాత డా కె రవి కిరనే నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బుల్గనిన్ స్వరాలు సమకుర్చరు.  కథ శివ ప్రసాద్ (శివ ప్రసాద్) ఓ నిజాయతీగల కానిస్టేబుల్ కొడుకు సప్తగిరి (సప్తగిరి)ని మాత్రం ఐఏఎస్ చేయాలనుకొంటాడు. కానీ సప్తగిరికి సినిమాలూ, నాటకాలంటే పిచ్చి. సినిమా నటుడవ్వాలని కలలు కంటుంటాడు. తన కాలనీకి కొత్తగా వచ్చిన పూర్ణిమ (రోషిణి ప్రకాష్) వెంట పడుతుంటాడు. అయితే ఓ ఎన్కౌంటర్లో శివప్రసాద్ ని దారుణంగా చంపేస్తారు. తండ్రి ఆశ‌యం కోసం త‌న‌కు ఇష్టం లేక‌పోయినా కానిస్టేబుల్‌గా మారాల్సివ‌స్తుంది. త‌న తండ్రి మ‌ర‌ణం వెనుక డిపార్ట్‌మెంట్‌లోని కొంత‌మంది (పోసాని, అజ‌య్‌ఘోష్‌) కుట్ర ఉంద‌ని తెలుసుకొని.. ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకొంటాడు. తన తండ్రి మరణం వెనుక మనుషులున్నారన్న సంగతి తెలుసుకొన్న సప్తగిరి ఏం చేశాడు? ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? అనేదే 'సప్తగిరి ఎక్స్ప్రెస్' కథ.
Read More

సప్తగిరి ఎక్సెప్రెస్ కాస్ట్ & క్రూ

సప్తగిరి ఎక్సెప్రెస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అరుణ్ పవర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విజయ్ బుల్గానిన్
నిర్మాత డా కె రవి కిరనే
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సప్తగిరి ఎక్సెప్రెస్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మాంచి మాస్ కథని పూర్తిగా మార్చేసి కేవలం కామెడీకోసమే ఈ కథ అన్నట్టు చూపించటం లో దర్శకుడు సక్సెస్ అయినట్టే. అందులోనూ సప్తగిరి లాంటి హీరో ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందో అంతవరకే అతన్ని వాడుకున్నడు. పగా, ప్రతీకారం అనగానే కనిపించే భారీ ఫైట్లూ, పంచ్ డైలాగులూ లేకుందా మొత్తానికి సప్తగిరితో ఓవర్ యక్షన్ చేయించకుండా అతన్ని ఫ్రీగా వదిలేసాడు. బ‌య‌ట సినిమాల్లో స‌ప్త‌గిరి ఎలా న‌వ్వించాడో, ఇక్క‌డా అలానే న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. పాట‌లు, ఫైటులు చేసినా అవీ కామెడీగానే సాగాయి. స‌ప్త‌గిరి న‌ట‌న‌పై పిచ్చి చూపించే సీన్లు, కాలేజీలో గోల్డు మెడ‌ల్ కోసం వేసిన వేషాలు న‌వ్విస్తాయి. త‌న న‌ట‌నా ప్ర‌తిభ చూపించ‌డానికి త‌ల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వేసిన ఏక పాత్రాభిన‌యం ఈ సినిమాకి హైలెట్ అయ్యింది. తండ్రి మ‌ర‌ణం.. దాన్నుంచి పుట్టుకొచ్చిన ఎమోష‌న్ ఈ సినిమాని ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కూ ద‌గ్గ‌ర చేస్తుంది. చెప్పాలంటే సినిమా అంతా స‌ప్త‌గిరి వ‌న్ మ్యాన్ షో..అనే చెప్పుకోవాలి న‌వ్వించాడు..ఎమోష‌న్ పండించాడు. ఆ మాట‌కొస్తే.. కామెడీ సీన్ల‌లో కంటే ఎమోష‌న్ సీన్ల‌లోనే స‌ప్త‌గిరి న‌ట‌న బాగుంది. ష‌క‌ల‌క శంక‌ర్ స‌పోర్టింగ్ రోల్‌ని ర‌క్తి క‌ట్టించాడు. పోసానిది అల‌వాటైన పాత్రే ఈ తరహా పాత్రల్లో పోసాని బాగా ఇమిడి పొతాడు.

సప్తగిరి ఎక్సెప్రెస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

సప్తగిరి ఎక్సెప్రెస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+