X
విజిల్

విజిల్

Action | 25 Oct 2019 | 179 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

విజిల్ స్టోరీ

విజిల్ సినిమా యాక్షన్, స్పోర్ట్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, నయనతార, కాథిర్, ఆనంద్ రాజ్, సాయి దీనా, వివేక్, యోగి బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అట్లీ కుమార్ వహించారు మరియు నిర్మాత కల్పాతి ఎస్ అఘోరామ్, కల్పాతి ఎస్ గణేష్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎ ఆర్ రెహమాన్ అందించారు.  కథ రాజప్ప (విజయ్) రౌడీ కుమారుడు మైఖేల్ ఉరఫ్ బిగిల్ (విజయ్) జాతీయ జట్టుకు ఆడాలనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తన కుమారుడు మైఖేల్ జాతీయ స్థాయిలో చాంఫియన్‌గా నిలిచి కప్పు సాధిస్తే చూడాలనే కోరికతో ఉంటాడు. అయితే ఉన్నతమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా మారే అవకాశం ఉన్న మైఖేల్ జీవితంలో చోటు చేసుకొన్న కొన్ని కారణాల వల్ల తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని రౌడీగా మారుతాడు. తండ్రి రాజప్ప రౌడీయిజం బాటలో మైఖేల్ ఎందుకు నడవాలని నిర్ణయం తీసుకొన్నాడు? ఫుట్‌బాల్ క్రీడను మైఖేల్ వదిలేయాల్సినంత అవసరం ఏం వచ్చింది. రౌడీగా మారిన బిగిల్ తన లక్ష్యాన్ని అందుకొన్నాడా? రౌడీయిజం కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న మైఖేల్ మళ్లీ ఫుట్‌బాల్ కోచ్‌గా మారాడు. ఫుట్ బాల్ సెలక్షన్ బోర్డు అధికారి (జాకీ ష్రాఫ్) పాత్ర ఈ సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లింది. కోచ్‌గా తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాడు. బిగిల్ జీవిత ప్రయాణంలో నయనతార పాత్ర ఏమిటి? ఈ చిత్రంలో ఎమోషనల్‌ అంశాలు తెరపైన ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానమే విజిల్ సినిమా కథ. ఓవర్ రివ్యూ పాయింట్స్ విజయ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ సినిమాకి మెయిన్ హైలైట్. మైఖేల్ లాంటి పాత్రలు విజయ్ గతంలో చేసాడు కావున అది ఓకే, కానీ రాజప్ప పాత్రలో విజయ్ నటన అద్భుతః అనిపిస్తుంది. రాజప్ప పాత్ర సినిమాలో ఉండేది తక్కువ సేపే అయినప్పటికీ మాస్ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. అలాగే నత్తి ఉన్న దైలాగ్ డెలివరీ కూడా బాగుంది. ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ ఇది వరకూ చూడని బ్యాక్ డ్రాప్.. కావున ఇది ఆన్ స్క్రీన్ మనకి ఓ మంచి ఫీల్ ఇస్తుంది. అంతే కాకుండా ఫుట్ బాల్ ఎపిసోడ్స్ లో వచ్చే ఎలివేషన్స్ కొన్ని సూపర్బ్ అనిపిస్తాయి. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ మరియు హీరో ఎలివేషన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కి నచ్చుతాయి. ఇద్దరి విజయ్ల్ మధ్య వచ్చే ఎమోషనల్ బ్లాక్, ఇంటర్వల్ యాక్షన్ సీన్, జాకీ ష్రాఫ్ – విజయ్ ఫ్లాష్ బ్యాక్ సీన్, విజయ్ – లేడీ టీం మధ్య బెట్ మ్యాచ్, శివంగి సాంగ్, క్లైమాక్స్ మ్యాచ్ లో పోచమ్మ ఎపిసోడ్.. ఈ ఎపిసోడ్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. మహిళల గురించి సెకండాఫ్ లో చెప్పే రెండు ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.
Read More

విజిల్ కాస్ట్ & క్రూ

విజిల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అట్లీ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత కాల్పథి ఎస్ అఘొరామ్, కాల్పథి ఎస్ గణేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విజిల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మాస్, ఎమోషనల్ అంశాలను జొప్పించి దర్శకుడు అట్లీ, సూపర్‌స్టార్ విజయ్ అందించిన స్పోర్డ్స్ డ్రామా విజిల్. ఈ సినిమా తొలిభాగం రొటీన్‌గా నడిచినా సెకండాఫ్‌లో ఎమోషనల్ అంశాలు జతకావడం సినిమాకు బలంగా మారింది. మాస్ ప్రేక్షకులు, దీపావళీ పండుగ సీజన్‌ను టార్గెట్‌గా చేసుకొని అందించిన భావోద్వేగమైన మూవీ అని చెప్పవచ్చు. ఈ చిత్రం తమిళనాడులోనే కాకుండా తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధించడానికి అవకాశం ఉంది.

విజిల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

విజిల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+